Amitabh Bachchan: మొన్న కొడుకు .. నిన్న తండ్రి .. అమితాబ్ కొన్న ఇంటి ధర ఎంతో తెలుసా ?

Amitabh Bachchan : రీసెంట్ గా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి 6 ఫ్లాట్స్ కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తండ్రి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని మూడు ఆఫీస్ యూనిట్లను కొన్నారు. మరి వాటి ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బీ కొన్న ఆస్తి ధర ?

బిగ్ బీ ఈ మూడు ఆఫీస్ యూనిట్లను రూ.60 కోట్లతో కొనుగోలు చేశారు. ముంబైలోని పోష్ ఏరియా అంధేరి వీర దేశాయ్ రోడ్‌లో ఉన్న వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్‌లో అమితాబ్ ఈ ఆస్తిని కొన్నట్టు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ఈ మూడు కార్యాలయ యూనిట్ల కోసం అమితాబ్ రూ. 59.58 కోట్లు చెల్లించారు. దీని మొత్తం వైశాల్యం 8,429 చదరపు అడుగులు. ఈ డీల్ సేల్ డీడ్ 2024 జూన్ 20న పూర్తి చేశారు. అందులో అమితాబ్ ఈ కమర్షియల్ ఆస్తికి స్టాంప్ డ్యూటీ రూ. 3.57 కోట్లు చెల్లించినట్లు ఉంది. మూడు ఆఫీసు యూనిట్లు కూడా విస్తారమైన కార్ పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉన్నాయని ఆస్తి పత్రాలలో ఉండడం విశేషం. వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అమితాబ్ ఈ కమర్షియల్ ఆస్తిని కొనుగోలు చేశారు.

ఒకే బిల్డింగ్ లో ఏడు ఫ్లాట్స్

ఈ భవనంలో అమితాబ్‌కు మొత్తం ఏడు కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే దీనిపై అమితాబ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సిగ్నేచర్ బిల్డింగ్‌లో బచ్చన్‌కి ఇప్పటికే నాలుగు ఆఫీస్ స్పేస్‌లు ఉన్నాయి. ఆయన ఆగస్టు 2023లో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేశాడు. అదే సంవత్సరం డిసెంబర్ 2023లో ముంబైలోని ఓషివారాలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు కమర్షియల్ ఆఫీసు యూనిట్లను రూ. 2.07 కోట్ల యాన్యువల్ అద్దె, రూ. 1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌తో అద్దెకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మూడు కమర్షియల్ యూనిట్లతో పాటు తాజాగా కొన్న ఆఫీస్ స్పేస్ లను కలుపుకుని సిగ్నేచర్ భవనంలో బచ్చన్ కు చెందిన మొత్తం ఏడు ఆఫీసు స్థలాలు ఉన్నాయి.

- Advertisement -

Amitabh Bachchan congratulates Abhishek Bachchan as Housefull 3 turns 8 | Filmfare.com

ఈ బిల్డింగ్ లో ఫ్లాట్స్ ఉన్న సెలబ్రిటీలు

గత ఏడాది జూలైలో కాజోల్ ఇదే భవనంలో 194 చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని కొన్నారు. ఆమె మాత్రమే కాదు సారా అలీ ఖాన్, ఆమె తల్లి అమృతా సింగ్ కూడా ఈ భవనం నాల్గవ అంతస్తులో రూ. 9 కోట్లతో ఒక యూనిట్‌ను 2023 జూలై 11న కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కార్తీక్ ఆర్యన్ నాల్గవ అంతస్తులో కమర్షియల్ స్థలాన్ని రూ. 10.09 కోట్లకు కొన్నారు. దీనికి ఆయన రూ. 47.55 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం.

అభిషేక్ బచ్చన్ కొన్న 6 లగ్జరీ అపార్ట్‌మెంట్లు

ఈ సంవత్సరం 2024 మేలో అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివాలిలో మొత్తం 6 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను రూ. 15.42 కోట్లు పెట్టి కొన్నారు. మొత్తంగా 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్లు బోరివాలిలోని అత్యాధునిక ఒబెరాయ్ స్కై సిటీలో ఉండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు