Kalki2898AD : నాగ్ అశ్విన్ కి ఆ హీరో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం… రెండు దశాబ్దాలలో నాగి ఒక్కడేనట..

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “కల్కి2898AD” సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు తన సినిమాతో సాలిడ్ ట్రీట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ సినిమాని కూడా అత్యద్భుతంగా చిత్రీకరించాడు. ఇక సినిమాకి విజువల్స్ ప్రాణం పోశాయి చెప్పొచ్చు. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలని ఈ సినిమాలో భాగం చేసిన నాగి, అందరికి వాళ్ళ వాళ్ళ పరిధులని బట్టి అద్భుతమైన రోల్స్ ని ఇచ్చాడు. ఇక అలాగే సినిమాలో కథకి సంబంధించి నాగ్ అశ్విన్ రాసుకుని స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. కాస్త ల్యాగ్ ఎక్కువయినా క్లైమాక్స్ వరకూ సినిమా కట్టిపడేస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా కల్కి లో ప్రభాస్ కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చినా, సూపర్ హీరోలా పెర్ఫెక్ట్ గా చూపించాడు నాగ్ అశ్విన్. అయితే ప్రభాస్ కాకుండా ఆ స్టార్ హీరో అభిమానులు మాత్రం చాలా ఏళ్ళ తర్వాత కాలర్ ఎగరేసుకునే సినిమా తీసాడు నాగ్ అశ్విన్. సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ కి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Amitabh Bachchan fans praise Nag Ashwin who directed Kalki2898AD

నాగి పై అమితాబ్ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం…

ఇక కల్కి (Kalki2898AD) లో నటించిన లెజెండరీ అమితాబ్ బచ్చన్ అభిమానులు మాత్రం నాగ్ అశ్విన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వద్ధామ గా నటించిన విషయం తెలిసిందే. ఆ రోల్ లో అమితాబ్ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరన్న స్థాయిలో అమితాబ్ స్క్రీన్ పెజెన్స్ ఉంటుంది. అమితాబ్ ని మహాభారత్ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ గా చూపించడమే కాకుండా, ఆ తర్వాత అశ్వద్ధామ గా వృద్దుడి యోధుడి రోల్ లో కూడా పవర్ ఫుల్ గా చూపించాడు నాగ్ అశ్విన్. ఇక చాలా కాలం తర్వాత అమితాబ్ బచ్చన్ అభిమానులు థియేటర్లలో తెగ హంగామా చేసారు, నార్త్ లో అమితాబ్ ఎంట్రీ కి థియేటర్లు దద్దరిల్లేలా హంగామా చేసారు అమితాబ్ డైయార్డ్ ఫ్యాన్స్. ఇక కల్కిలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ ని మించిన ఎలివేషన్లు అమితాబ్ కి పడ్డాయి. ఫైట్ సీన్స్ లో అమితాబ్ ని చూసి కామన్ ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఈ వయసులో కూడా అమితాబ్ ఇంత కష్టపడ్డారంటే మూవీస్ పై డెడికేషన్ అర్ధం చేసుకోవచ్చు. సరైన మూవీ పడితే బాలీవుడ్ లో ఖాన్ల త్రయం కూడా బిగ్ బి ముందు దిగదుడుపే అంటున్నారు మూవీ లవర్స్..

- Advertisement -

రెండు దశాబ్దాల్లో నాగి ఒక్కడే…

ఇక అమితాబ్ బచ్చన్ 20వ దశకం తర్వాత హీరోగా సినిమాలు చేయడం తగ్గించగా, అప్పటికీ తాను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు తక్కువే. కానీ ఈ రెండు దశాబ్దాల కాలంలో అమితాబ్ ని నాగ్ అశ్విన్ చూపించినంత పవర్ ఫుల్ గా ఎవ్వరూ చూపించలేదని అంటున్నారు నెటిజన్లు. అమితాబ్ సినిమాలు లెక్కేస్తే.. తాను చేసిన రోల్స్ చూస్తే అలాగే ఉన్నాయి. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “సర్కార్” సినిమాలో అమితాబ్ బచ్చన్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కల్కి లో అంతకు మించిన పవర్ ఫుల్ రోల్ లో నటించడం జరిగింది. ఇక సర్కార్ డైరెక్టర్ కూడా తెలుగు డైరెక్టర్ కావడం విశేషం. ఇక నార్త్ లో ఇప్పుడిప్పుడే అమితాబ్ పాత్ర గురించి తెలిసి థియేటర్లకు క్యూ కడుతున్నారు అమితాబ్ ఫ్యాన్స్. ఇక కల్కి సినిమా రెండో రోజుతో మూడు వందల కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు