Amitabh Bachchan : 55 ఏళ్ల కెరీర్ లో సాధించలేని ఘనత కల్కితో సాధ్యం… బిగ్ బీ అసాధ్యుడే (1000 కోట్ల మూవీ)

Amitabh Bachchan : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ సందడి బాక్స్ ఆఫీసు వద్ద ఇంకా చల్లబడలేదు. ఇప్పటికే వెయ్యి కోట్లు దాటిన ఈ మూవీ కలెక్షన్లు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే బిగ్ బీ అమితాబ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి పడింది. 55 ఏళ్ల కెరీర్ లో సాధించలేని అసాధ్యమైన ఓ ఘనత కల్కి మూవీతో అమితాబ్ కు సాధ్యమైంది. అదేంటంటే..

అమితాబ్ అసాధ్యుడే

80 ఏళ్ల వయసులో అమితాబ్ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రిలోని అడుగు పెట్టి గత ఐదు దశాబ్దాలలో సాధించలేకపోయిన రికార్డును తన పేరు మీద రాసుకోవడానికి కల్కి హెల్ప్ కావలసి వచ్చింది బిగ్ బీకి. ఇంతకీ విషయం ఏమిటంటే ఇన్నేళ్లలో ఇన్నో క్లాసిక్ కల్ట్ హిట్స్ తో పాటు ఎన్నో మాస్, ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సినిమాలలో కూడా నటించారు అమితాబ్. కానీ ఒక్క సినిమా కూడా ఆయన 1000 కోట్ల క్లబ్ లో చేర్చలేకపోయింది. కానీ మొత్తానికి కల్కితో ఇప్పటిదాకా నెరవేరని అమితాబ్ 1000 కోట్ల కోరిక ఇప్పుడు తీరిపోయింది. నిజానికి ఆయన సినిమాలో మెయిన్ హీరో కాకపోయినా, హీరోకు సమంగా ప్రాధాన్యత, హీరో కంటే ఎక్కువ నిడివే ఉంది. అంతేకాదు సినిమాను అమితాబే నడిపించిన ఫీలింగ్ వస్తుంది.

నాగ్ అశ్విన్ సినిమాలో మూడు విభిన్న ప్రపంచాలను చూపించారు. ఏది – కాశీ, కాంప్లెక్స్ మరియు శంబాలా… ఇటీవల అతను దాని సీక్వెల్ గురించి అభిమానులను అప్‌డేట్ చేశాడు. సెకండ్ పార్ట్ లో కూడా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలో అశ్వత్థామ భైరవను డామినేట్ చేస్తూ కనిపిస్తాడు.

- Advertisement -

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రోజు 15: చిత్రం నుండి ఒక స్టిల్‌లో ప్రభాస్.

1000 కోట్ల క్లబ్ లో చేరిన కల్కి

కాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ హవా నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఈ సినిమా విడుదలై 15 రోజులైంది. రోజుకో రికార్డును బద్ధలు కొడుతున్న ఈ మూవీ తాజాగా 1000 కోట్ల కలెక్షన్లు దాటేసింది. త్వరలోనే ఈ సినిమా మూడో వారాంతంలోకి అడుగుపెట్టబోతోన్న కల్కి జూలై 8న 945 కోట్లు రాబట్టిందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన రావడంతో 1000 కోట్ల కోరిక కూడా తీరిపోయింది.

జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా కలెక్షన్స్ లో 14వ రోజు డ్రాప్ కన్పించింది. సమాచారం ప్రకారం ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద 14వ రోజు మొత్తం 7.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. తెలుగులో 1.7 కోట్లు, తమిళంలో రూ.0.55 కోట్లు, హిందీలో రూ.4.75 కోట్లు, కన్నడలో రూ.0.1 కోట్లు, మలయాళంలో రూ.0.4 కోట్లు రాబట్టింది. అయితే 13వ రోజుతో పోలిస్తే ఈ సినిమా వసూళ్లు 14 శాతం తగ్గాయి. ఏదైతే ఏముంది బాహుబలి తరువాత ప్రభాస్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి చాలా టైమ్ పట్టింది. అయితే కల్కితో మళ్లీ ఈ అరుదైన ఫీట్ ను ప్రభాస్ సాధించడంతో రెబల్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరపడుతున్నారు ఆయన ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు