Amithab Bachchan : కల్కి విషయంలో బిగ్ బికి తీరని కోరిక ఇదే

Amithab Bachchan : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అశ్విని దత్ తెరకెక్కించారు. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జాన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. సినిమాలో అమితాబచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకొనే కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్ల మార్కెట్ వైపు దూసుకెళ్తుంది. నాగ అశ్విన్ ఈ సినిమాతో ప్రపంచమంతా మరోసారి తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు అని చెప్పొచ్చు.

ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ అశ్వద్ధామ అనే పాత్రలో కనిపించారు. ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కోసం ఈ సినిమాకి వెళ్లిన చాలా మందికి కూడా ఈ సినిమాలో మెయిన్ హీరో అమితాబచ్చన్ అని అనిపించేలా ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇకపోతే అమితాబచ్చన్ గారి గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది.

Kalki 2898 AD Amitabh Bachchan

- Advertisement -

ఇకపోతే అమితాబచ్చన్ కల్కి సినిమా గురించి మరో ఇంటర్వ్యూ ఇచ్చారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తో మాట్లాడుతూ తనకు కల్కి సినిమాను హైదరాబాద్ లో ప్రేక్షకులతో పాటు చూడాలి అని ఉంది అంటూ చెప్పకు వచ్చారు. హైదరాబాద్లో ఆడియన్స్ సినిమాని ఎంతలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఇండస్ట్రీకి తెలుసు. ఒక సినిమాను సెలబ్రేట్ చేయడం తెలుగు వాళ్ళకి అలవాటు. ఇక అమితాబచ్చన్ కోరిక మేరకు ఈ సినిమాను ఆడియన్స్ తో పాటు ప్లాన్ చేయనున్నాడు నాగ్ అశ్విన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు