Amma Rajasekhar : వినాయక చవితికి అమ్మ రాజశేఖర్ సడన్ సర్ప్రైజ్… కొత్త మూవీ పోస్టర్ తో విషెస్

Amma Rajasekhar : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా తన సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ తో పాటు మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేశారు. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

చాలా రోజుల తర్వాత..

అమ్మ రాజశేఖర్ గురించి టాలీవుడ్ మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన స్టైల్ లో ఎంతోమంది స్టార్ హీరోల చేత అదిరిపోయే స్టెప్పులు వేయించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్. కేవలం కొరియోగ్రాఫర్ గానే ఉండిపోకుండా డైరెక్టర్ గా కూడా మారి పలు సినిమాలతో మెప్పించారు. గోపీచంద్ హీరోగా నటించిన రణం మూవీతో డైరెక్టర్ గా మారారు ఈ కొరియోగ్రాఫర్. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత పలువులు స్టార్ హీరోలతో కలిసి మూవీ చేసే అవకాశం దక్కింది అమ్మ రాజశేఖర్ కి. ఫలితంగా రవితేజతో కలిసి ఖతర్నాక్ అనే సినిమాను చేశాడు. కానీ ఈ మూవీ ఆడలేదు. ఆ తర్వాత కూడా యంగ్ హీరో నితిన్ తో టక్కరి అనే సినిమాను చేశాడు. కానీ అది కూడా బోల్తా కొట్టడంతో ఆ తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే టక్కరి సినిమాలో నితిన్ తో ఊర మాస్ స్టెప్పులు వేయించి అదరహో అనిపించాడు. ఇక ఆ తర్వాత కూడా రణం 2 అనే మూవీ తీసి చేతులు కాల్చుకున్నాడు.

- Advertisement -

మొత్తానికి సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతుండడంతో కెరీర్లో కొంత గ్యాప్ తీసుకొని బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ రియాల్టీ షోలో కూడా అమ్మ రాజశేఖర్ తనదైన స్ట్రాటజీతో గేమ్ ఆడి పర్లేదు అనిపించాడు. ఇక ఆ తర్వాత బయట పెద్దగా కనిపించని ఈ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రీసెంట్ గా ఓ మూవీని అనౌన్స్ చేశారు. తాజాగా దానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు.

కొత్త మూవీ పోస్టర్ తో స్పెషల్ విషెస్

ప్రస్తుతం ఈ డైరెక్టర్ కు అవకాశాలు కరువు కావడంతో తన వారసుడు అమ్మ రాగిన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ మూవీని తీయబోతున్నామని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తే, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి తల అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా వెల్లడించారు. అందులో భాగంగానే వినాయక చవితి విషెస్ అందిస్తూ తల మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ మూవీతోనైనా అమ్మ రాజశేఖర్ బౌన్స్ బ్యాక్ అవుతారా అనేది చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు