Ammu Abhirami: డైరెక్టర్ ప్రేమలో తెలుగు హీరోయిన్.. ఎవరంటే..?

Ammu Abhirami.. చాలామంది హీరోయిన్ గా ఎదగాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో చిన్న వయసులోనే నటిగా తన సినీ కెరియర్ ని మొదలుపెట్టింది అమ్ము అభిరామి.. కేవలం 17 ఏళ్లకే నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఏనుగు, అసురన్, రాక్షసన్ వంటి చిత్రాలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ధనుష్ నటించిన అసురన్ సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది.. ఈ చిత్రం తెలుగులో నారప్పగా విడుదల అయింది.. ఇందులో కూడా ఈమె మరియమ్మ పాత్రలో నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన అమ్ము అభిరామి , డెవిల్ , రణస్థలి వంటి చిత్రాలలో కూడా నటించింది.

ఆ డైరెక్టర్ తో రిలేషన్లో అమ్ము అభిరామి..

Ammu Abhirami: Telugu heroine in director's love.. Who is..?
Ammu Abhirami: Telugu heroine in director’s love.. Who is..?

అయితే గత కొద్దిరోజుల నుంచి ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక న్యూస్ అయితే ఎక్కువగా వినిపిస్తోంది అదేమిటంటే అమ్ము అభిరామి డైరెక్టర్ పార్థివ్ మణితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కుక్ షో లో పాల్గొన్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం బాగా ఏర్పడిందని.. ఆ పరిచయమే ప్రేమగా మారిందని తెలుస్తోంది.. కొన్నేళ్లుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ విషయాలన్నిటిని సైతం బయట పెట్టేసింది అమ్ము అభిరామి.

ఇన్ స్టా పోస్టు తో క్లారిటీ..

తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఇలా రాసుకోస్తూ.. పార్థివ్ మణి తో కలిసి మిర్రర్ సెల్ఫీ తీసుకుంటున్న ఒక వీడియోని సైతం షేర్ చేయడం జరిగింది.. పార్థివ్ మణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కూడా వెల్లడించింది. హ్యాపీ బర్తడే పార్థివ్.. పుట్టినందుకు నా జీవితంలోకి రాబోతున్నందుకు థాంక్స్ అంటూ తెలియజేసింది. ఈ పోస్టుని చూసిన అభిమానులు సైతం ఈ జంటకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉన్న తమ లవ్ స్టోరీని ఎట్టకేలకు అమ్ము అభిరామి బయట పెట్టేసిందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.

- Advertisement -

త్వరలోనే పెళ్లి కూడా..

అయితే త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో కూడా పార్థివ్ మణి కూడా అమ్ము అభిరామ్ కి సంబంధించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో ఇంస్టాగ్రామ్ లో కూడా ఒక పోస్ట్ ని షేర్ చేశారు. వరుస సినిమాలతో అమ్ము అభిరామి మాత్రం బిజీగా గడిపేస్తోంది. ఇందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ పోస్టర్లు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటారు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక త్వరలోనే ఆ వివాహ వేడుక కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..మరి వివాహం అనంతరం అమ్మో అభిరామి సినిమాలలో కంటిన్యూ అవుతుందా లేక కొంతమంది హీరోయిన్స్ లాగా వ్యక్తిగత జీవితానికి తన కెరీర్ను అంకితం చేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ప్రేమలో పడి ఒకరి తర్వాత ఒకరి వివాహం చేసుకుంటూ సెటిల్ అయిపోతున్నారు అనడంలో సందేహం లేదు. మరి పార్దివ్ కూడా వరుస సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ స్టేటస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ammu_Abhirami (@abhirami_official)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు