Liger: ఫెయిల్ అయింది సినిమా మాత్రమే విజయ్ కాదు – ఆనంద్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పై ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బేబీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంట్రాక్ట్ అయిన ఆనంద్ ను విజయ్ గురించి అడగటంతో ఆయన ఈ విధంగా మాట్లాడారు.

గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా, ప్రేక్షకులను ఎంతగా నీరాశపరిచిందో అందరికి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఒక్కసారిగా విజయ్ కెరీర్ గందరగోళంగా మారింది. లైగర్ సినిమాపై నమ్మకంతో ఇండియా వైడ్ సినిమాని గట్టిగ ప్రమోట్ సినిమా విజయ్ ను లైగర్ ఎలా ఎఫెక్ట్ చేసింది అని యాంకర్ అడగగా ఆనంద్ దేవరకొండ ఇలా సమాధానం ఇచ్చాడు.

” లైగర్ సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాకనే రిజల్ట్ అర్థమైపోయింది. విజయ్ అన్న ఇంకా ఆ సినిమాను జనాల మీద రుద్దాలనే ప్రయత్నం వదిలేసి, అలాగే ఫిజికల్ గా, మెటల్ గా బాగా కష్టపడ్డమే అని బాధపడటం మానేసి ఆగస్టు 25 ఈవెనింగ్ నుంచి ఖుషి సినిమాకు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసాడు. అన్న సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అన్న ఎఫర్ట్స్ మీద ఎవరు వేలెత్తి చూపారు” అంటూ ఆనంద్ సమాధానం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వస్తోన్న బేబీ సినిమాను సాయి రాజేష్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు