Anand Devarakonda : మొత్తానికి ‘బేబీ’ మెయిన్ లీడ్స్ ముగ్గురూ ప్లాప్స్ అందుకున్నారు..!

Anand Devarakonda : టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా “బేబీ”. శ్రీనివాస్ కుమార్ నాయుడు నిర్మించిన ఈ సినిమాను సాయి రాజేష్ నీలం తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించగా వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్ గా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఊహించని ఘన విజయం సాధించింది. నిజానికి ఈ సినిమా స్టోరీ పెద్దగా ఉండదు. టీనేజ్ లో ఉండే అట్రాక్షన్ కి యువత ఎలా బలైపోతుందో ప్రాక్టికల్ గా కాస్త బోల్డ్ అంశాలతో తెరకెక్కించారు మేకర్స్. ఒక మాటలో చెప్పాలంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనొచ్చు. పలు వివాదాలు, విమర్శలతో థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమాతో మెయిన్ లీడ్స్ గా నటించిన ముగ్గురికీ మంచి పేరు వచ్చింది. అయితే ఈ ఇయర్ లో ఈ ముగ్గురు వేర్వేరుగా నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Anand Devarakonda starrer Gam Gam Ganesha turns out to be a flop

మూడు వేర్వేరు సినిమాలతో పలకరించిన బేబీ నటీనటులు..

ఇక లాస్ట్ ఇయర్ బేబీ సినిమా సక్సెస్ తో గుర్తింపు పొందిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ఇప్పుడు వేర్వేరు సినిమాలతో ఈ ఏడాది వచ్చారు. అయితే ఈ సారి మాత్రం వీళ్ళకి కలిసిరాలేదు. రెండు నెలల కింద బేబీ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన “విరాజ్ అశ్విన్”, ఈ ఇయర్ లో హీరోగా “శ్రీ రంగ నీతులు” అనే సినిమాలో నటించాడు. రెండు కింద రిలీజ్ అయిన శ్రీ రంగ నీతులు అసలు ఎప్పుడొచ్చిందో కూడా జనాలకు తెలీదు. ఇక రీసెంట్ గా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లవ్ మీ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులని పలకరించింది. దిల్ రాజు నిర్మించిన ఆ సినిమాలో దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ హీరోగా నటించాడు. ఇక తాజాగా బేబీ లో హీరో అయిన ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన గంగం గణేశా సినిమా గతవారం రిలీజ్ కావడం జరిగింది. అయితే అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

- Advertisement -

బేబీ మెయిన్ లీడ్స్ ముగ్గురికి ప్లాప్ లు..

ఇక బేబీ సినిమాలో నటించిన ఈ ముగ్గురి సినిమాలు ఈ ఏడాది వేర్వేరుగా విడుదలయ్యాయి. అయితే ముగ్గురి సినిమాలు కూడా ప్లాప్ కావడం జరిగింది. విరాజ్ అశ్విన్ నటించిన శ్రీరంగ నీతులు, అలాగే వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ, లేటెస్ట్ గా ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ సినిమా కూడా ప్లాప్ అయింది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ నటీనటులు ముగ్గురు కూడా డిజాస్టర్లు అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కూడా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలతో ప్లాప్ అందుకున్న నటీనటులు, సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుండి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా వైష్ణవి చైతన్యపై బాగా ట్రోల్స్ వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు