Anand Deverakonda : ఒక్కో సైటైర్ ఒక్కో డైమండ్

Anand Deverakonda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే చాలా కష్టపడి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని పెళ్లిచూపులు సినిమా తోని హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా ఎదిగాడు. అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఆనంద్.

దొరసాని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఆ సినిమాకి మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు ఆనంద్ కి లభించాయి. అయితే వినోద్ దర్శకత్వంలో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా ఆనంద్ కెరియర్ లో మంచి హిట్ అయింది. ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సాధించుకుంది. ఆనంద్ కెరీర్ కు మంచి ప్లస్ గా మారింది. అక్కడితో ఆనంద్ కి డిమాండ్ కూడా పెరిగిపోయింది.

Anand Deverakonda

- Advertisement -

బేబీ సినిమాతో బ్రేక్

ఇక రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా బేబీ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది ఈ చిత్రం. దాదాపు 50 కోట్లకు పైగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేసింది. నిర్మాత ఎస్ కే ఎన్ కు అధిక లాభాలు తెచ్చి పెట్టింది. హీరోయిన్ వైష్ణవి చైతన్యకు వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆనంద్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

వైరల్ గా మారిన ఇంటర్వ్యూ

ఆనంద్ నటిస్తున్న సినిమా గంగం గణేశా ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు కూడా ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఆనంద్ డాన్సులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో జబర్దస్త్ ఫేమ్ ఇమ్మానుయేల్ తో ఒక వీడియోను చేశాడు ఆనంద్. ఆ వీడియోలో కంప్లీట్ గా బ్యాక్ టు బ్యాక్ సెటైర్లు వేస్తున్నాడు ఆనంద్. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు