Anant Ambani Wedding : ఈ ఇద్దరు సౌత్ స్టార్స్ కే అంబానీ పెళ్లి ఇన్విటేషన్… ఇదీ మెగా రేంజ్

Anant Ambani Wedding : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ఫ్యూచరిస్ట్ పీటర్ డైమండిస్, ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్, సెల్ఫ్-హెల్ప్ కోచ్ జే శెట్టి మొదలైన ఇంటర్నేషనల్ ప్రముఖులు హాజరవుతారు. అంతేకాదు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలకు అంబానీలు సిద్ధమవుతున్న వేళ, పెళ్లికి సంబంధించిన గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అందులో ఎంతమంది సౌత్ హీరోలు ఉన్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ మెగా రేంజ్

ఆసియాలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ను 2024 జూలై 12న వివాహం చేసుకోనున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తమ భార్యలతో సహా పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు ముంబైకి బయలుదేరారు. ముంబైకి వెళ్లే క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయంలో వీరిద్దరూ విడివిడిగా కనిపించారు. ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ విలాసవంతమైన కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే సౌత్ నుంచి ఎవరెవరికి అంబానీ ఆహ్వానం అందింది అన్న విషయం ఇంకా బయటకు రాలేదు. కానీ మెగా స్టార్స్ ఇద్దరూ అంబానీల పెళ్ళికి హాజరవుతుండడం సంచలనంగా మారింది. ఇక ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్ ఇదీ మెగా రేంజ్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం జరిగిన అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ వేడుకలో సౌత్ నుంచి మెరిసిన ఒకే ఒక్క స్టార్ కపుల్ చెర్రీ దంపతులు.

Pawan Kalyan and Ram Charan Likely to Star Together in Upcoming Shankar Movie - News18

- Advertisement -

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ గెస్ట్ లిస్ట్

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ గెస్ట్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, దీపికా పదుకొణె, అలియా భట్ లతో పాటు బీ-టౌన్ అగ్ర నటీనటులు హాజరు కానున్నారు. అలాగే ప్రధాన వివాహ వేడుకల అతిథి జాబితాలో రియాలిటీ షో స్టార్స్ కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ఫ్యూచరిస్ట్ పీటర్ డైమండిస్, ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్, జే శెట్టి, యూకె మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్, యూఎస్ మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, కెనడా మాజీ పిఎం స్టీఫెన్ హార్పర్ వివాహ వేడుకలో పాల్గొంటారు. ఇంకా పలువురు రాజకీయ. క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ కు ఇన్విటేషన్ అందినట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు