Anant Ambani Wedding : అంబానీ పెళ్ళిలో సెలబ్రిటీల చేతికి కలర్ బ్యాండ్స్… వాటి మీనింగ్ ఏంటో తెలుసా?

Anant Ambani Wedding : ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ, తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని ఫార్మాస్యూటికల్ వారసురాలు రాధికా మర్చంట్‌తో ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో మూడు రోజుల గ్రాండ్ ఈవెంట్‌లో అత్యంత ఘనంగా జరిపారు. ఇప్పటికే పెళ్ళికి అటెండ్ అయిన సెలబ్రిటీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటినైతే అల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. కానీ అంబానీ పెళ్ళికి హాజరైన సెలబ్రిటీలు తమ చేతికి రకరకాల కలర్ బ్యాండ్స్ కట్టుకున్న విషయాన్ని మీరు గమనించారా? ఒకవేళ ఇప్పటికే చూసి ఉంటే దీనర్థం ఏంటో తెలుసా?

సెలబ్రిటీల చేతికి బ్యాండ్ ఎందుకంటే ?

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 12 జూలై 2024న జియో వరల్డ్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి వేల సంఖ్యలో అతిథులు వచ్చారు. అయితే వారి చేతులకు రెడ్, పింక్, ఎల్లో.. ఇలా ఒక్కొక్కరి చేతికి ఒక్కో కలర్ బ్యాండ్ కన్పించింది. అయితే ఇదంతా ఎందుకంటే అంబానీ వివాహ వేదికలోని వివిధ జోన్‌లకు అతిథులు యాక్సెస్‌ను అనుమతించడానికి QR కోడ్‌లతో పాటు కలర్-కోడెడ్ రిస్ట్‌బ్యాండ్‌లతో హై-ఎండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ ఫాలో అయ్యారు.

అనంత్, రాధిక పెళ్లి ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. సెలెబ్స్ మాత్రమే కాకుండా విజిటింగ్ గెస్ట్‌లందరి మణికట్టు మీద రంగురంగుల బ్యాండ్‌లను మీరు తప్పక చూసి ఉంటారు. అతిథుల సౌకర్యార్థం మాత్రమే వీటిని అందించారు.

- Advertisement -

ప్రపంచ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, క్రికెటర్లు, సినీ తారలు, రాజకీయ నాయకులు హాజరైన వివాహ వేడుకతో జూలై 12న వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై 13న ‘శుభ్ ఆశీర్వాద్’ అనే ఆశీర్వాద కార్యక్రమం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. జూలై 14న రిసెప్షన్, ‘మంగళ ఉత్సవ్’ వ్యాపార సహచరులతో సహా అనేక మంది అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ నిర్వహించింది. అయిత ఒక్కో ఈవెంట్ కు హాజరైన ఒక్కో సెలబ్రిటీ చేతికి ఒక్కో రంగులో ఉన్న బ్యాండులు కనిపించాయి. వాటి వెనకున్న సీక్రెట్ ఏంటంటే బ్యాండ్ రంగు ప్రకారం అతిథులు సిట్టింగ్ జోన్‌లోకి ప్రవేశించారు. పింక్ బ్యాండ్‌లు ధరించిన అతిథులు ప్రత్యేక సిట్టింగ్ జోన్‌ను కలిగి ఉండగా, ఆరెంజ్ బ్యాండ్‌లు ధరించిన అతిథులు వేరే జోన్‌లో ప్రవేశించారు. ఈ బ్యాండ్ల సాయంతో అతిధులకే కాకుండా సెక్యూరిటీ సిబ్బందికి కూడా పనిలో ఎంతో సౌలభ్యం లభించింది. సీటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అతిథులకు వివిధ రంగుల రిస్ట్‌బ్యాండ్‌లను అందజేసినట్లు సమాచారం. అంటే అతిథుల సౌకర్యార్థం మాత్రమే వీటిని అందించారు.

క్యూఆర్ కోడ్ ప్రత్యేకత ఏంటంటే?

నిజానికి ఇది మాత్రమే కాదు అనంత్-రాధికల వివాహానికి వచ్చే అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చారు. అతిథులకు ఆహ్వాన కార్డులు ఇవ్వడంతో పాటు, అంబానీ కుటుంబం క్యూఆర్ కోడ్‌లను కూడా అందించింది. QR కోడ్‌ని చూపుతూ అతిథులు పెళ్లిలోకి ప్రవేశించారు. తరువాత వారి బ్యాండ్ ప్రకారం వారిని వారి సిట్టింగ్ జోన్‌లో కూర్చోబెట్టారు. దీని వల్ల అతిథులకు గానీ, ఉద్యోగులకు గానీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు.

ఎవరి చేతికి ఏ కలర్ బ్యాండ్?

అలియా భట్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ నుండి చాలా మంది ఇతర తారల వరకు, వారి చేతుల్లో పింక్ బ్యాండ్‌లు కనిపించగా, అనన్య పాండే, అట్లీ నుండి రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ వరకు బ్లూ బ్యాండ్‌లు కట్టుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు