Anant Ambani : అంబానీ వారసుడి పెళ్లి ఖర్చు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ గురించే చర్చ నడుస్తోంది. ఈ వేడుకకు దేశంలోని పలువురు ప్రముఖులతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న చాలామంది వివిఐపిలకు ఆహ్వానాలు అందాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చ్ 1 నుంచి 3వ తేదీ వరకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరుపుతున్నారు. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం.

పెళ్లి ఖర్చు 1000 కోట్లు
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు స్టార్ట్ అయిపోయాయి. గతేడాది జనవరిలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం జరిగింది. అప్పటినుంచే తరచుగా పెళ్లికి సంబంధించి ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉన్నారు. 2024 జూలై 12న ముంబైలో వీరి వివాహం ఘనంగా జరగనుండగా, తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మార్చ్ 1 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, స్పోర్ట్స్ పర్సన్స్, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనంత్ అంబానీ పెళ్లి ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ వెడ్డింగ్ గా చరిత్రలో నిలువబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ముఖేష్ అంబానీ తన వారసుడి పెళ్లి కోసం ఏకంగా 120 మిలియన్ డాలర్లకు పైగా వెచ్చించబోతున్నారట. అంటే భారత కరెన్సీ లో చూసుకుంటే 1000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. పాప్ సింగర్ రిహన్న, డేవిడ్ బ్లైయిన్ వంటి అంతర్జాతీయ సింగర్లు అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారు.

అతిథులకు స్పెషల్ వంటకాలు
ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వచ్చే అతిధుల కోసం ఏకంగా 2500 రకాల వంటకాల్ని వడ్డించబోతున్నారట. అతిధులకు ఒకసారి వడ్డించిన భోజనాన్ని మరోసారి రిపీట్ చేయకుండా కలకాలం గుర్తుండిపోయే ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక మెనూ కూడా సిద్ధం చేయించారని తెలుస్తోంది. ఇండోర్ నుంచి 21 మంది ప్రముఖ చెఫ్స్ ను పిలిపించినట్టు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

కూతురు పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారంటే?
ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లి కోసం కూడా వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కూడా ఇండియాలోని అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటి. 2018 డిసెంబర్ 12న ఇషా అంబానీ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ పిరమల్ ను పెళ్లాడింది. అప్పట్లోనే వీరి వివాహం కోసం ముఖేష్ అంబానీ ఏకంగా 700 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. కాగా ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానాల వివాహమే ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన అత్యంత ఖరీదైన వివాహం. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టుగా అనంత్ అంబానీ పెళ్లికి 1000 కోట్లు ఖర్చు చేస్తే, ప్రిన్స్ చార్లెస్ రికార్డును అంబానీ ఫ్యామిలీ బ్రేక్ చేసినట్టే.

రామ్ చరణ్ దంపతుల సందడి
గుజరాత్ లోని జాంనగర్లో ఉన్న జోగ్వాడ్ లో అన్నదాన సేవతో బుధవారం అనంత్ వెడ్డింగ్ కి సంబంధించిన ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కేవలం ఒకే ఒక్క ఫ్యామిలీకి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. వాళ్లు మరెవరో కాదు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. ఇప్పటికే చెర్రీ తన సతీమణితో కలిసి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో పాలు పంచుకోవడానికి ప్రత్యేక విమానంలో జామ్ నగర్ చేరుకున్నారు. వీళ్ళకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు