Ananth – Radhika: ప్రీ వెడ్డింగ్ కి పాప్ సింగర్.. ఎన్ని కోట్లు తెలిస్తే హార్ట్ ఎటాక్..!

Ananth – Radhika..ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ప్రధమంగా వినిపించే పేరు ముఖేష్ అంబానీ..తాజాగా ఈయన కుటుంబంలో వివాహ వేడుకలు జరగబోతున్నాయి. సాధారణంగా ఈ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ప్రపంచస్థాయిలో వైరల్ అవుతూ ఉంటుంది.. అలాంటిది పెళ్లి వేడుక అంటే ఇక ఆ ఈవెంట్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ లభిస్తుందో ఊహించవచ్చు.. ముఖ్యంగా ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. అయితే ఇటీవలే గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.. ఇప్పుడు రెండవ ప్రీ వెడ్డింగ్ అంటూ మే 29వ తేదీన ఈ వేడుకను చాలా గ్రాండ్గా మొదలుపెట్టారు.

పాప్ సింగర్ కాటి పెర్రీ ప్రదర్శన..

Ananth - Radhika: Pre-wedding pop singer.. Heart attack if you know how many crores..!
Ananth – Radhika: Pre-wedding pop singer.. Heart attack if you know how many crores..!

ఈ ప్రీ వెడ్డింగ్ ఫ్రాన్స్, ఇటలీలలో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి అలాగే వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఇకపోతే ఈవెంట్ కి గతంలో జరిగిన నిశ్చితార్థ వేడుకలలో ప్రముఖ ప్రపంచ స్థాయి పాప్ సింగర్ రిహాన్నా ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో పాప్ సింగర్ కాటి పెర్రీ ని ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం తీసుకువచ్చారు. ఈ ప్రీ వెడ్డింగ్ నిన్న ఇటలీలోని ఫోర్టో ఫినోలో ముగిసింది . పాప్ స్టార్ కాటి పెర్రీ కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది . ఈ వీడియోలో పాప్ సింగర్ క్రూయిజ్ లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నట్లు కనిపించింది.కాటి పెర్రీ మెరిసే సిల్వర్ కలర్ దుస్తులలో చాలా అద్భుతంగా కనిపించింది.. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో అందరి చూపు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ పైనే ఉందని చెప్పవచ్చు .. ఇక ప్రస్తుతం పాప్ సింగర్ కి సంబంధించిన ఫోటోలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి.

కాటి పెర్రీ ప్రదర్శన కు భారీ నజరానా..

ఇకపోతే ఈ వీడియోలో కాటి పెర్రీ తన అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చింది.. అంతేకాదు తన పర్ఫామెన్స్ కి సుమారుగా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని సమాచారం.. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు దీని విలువ రూ.45 కోట్లు.. మొత్తానికైతే ఒక్క గంట కోసం ఈమె ఏకంగా రూ .45 కోట్లు అందుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

- Advertisement -

దేదీప్యమానంగా ప్రీ వెడ్డింగ్ షూట్..

ఇకపోతే అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నుంచి బ్యాక్ స్టిచ్ బాయ్స్ బ్యాండ్ ప్రదర్శన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ భారీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ లో మిరుమెట్లు గొలిపే కాంతులతో.. రంగురంగుల టపాసులతో దేదీప్యమానంగా ఫంక్షన్ జరిగింది అని చెప్పవచ్చు. ఇక ప్రపంచంలోనే కని విని ఎరుగని రీతిలో అనంత్ అంబానీ వివాహ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.. ముఖ్యంగా ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన ఈ పార్టీ లో రంగురంగుల టపాసులు పెళుతూ.. కన్నుల పండుగగా చాలా అద్భుతంగా అనిపించిందని తాజా వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు