8Vasanthalu : ‘శుద్ధి అయోధ్య’ గా చూపిస్తున్నారట.. మేకర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు?

8Vasanthalu : టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత విజయవంతమైన సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థ ఏదైనా ఉందంటే అది ‘మైత్రీ మూవీ మేకర్స్’ అనే చెప్పాలి. ఈ సంస్థ గత కొన్నాళ్లుగా ఎలాంటి సినిమాలు చేసినా సక్సెస్ అవుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా అన్నింట్లోనూ వీళ్ళ చేయి ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లుగా కూడా భారీ లాభాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం వీళ్ళ చేతిలో పాన్ ఇండియా సినిమాలే అరడజను దాకా ఉన్నాయి. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా ఓ వైపు బడా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తూ, మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలు తెరకెక్కిస్తూ హిట్లు కొడుతోంది. ఇదిలా ఉండగా పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ‘ఫణీంద్ర నర్సెట్టి’ డైరెక్షన్ లో “8 వసంతాలు” (8Vasanthalu) సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వాలెంటైన్స్ డే రోజు ఈ సినిమాను అనౌన్స్ చేసిన మేకర్స్.. టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అప్పుడే సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.

Ananthika As Shuddhi Ayodhya in 8Vasanthalu Movie

శుద్ధి అయోధ్యగా చూపిస్తున్నారట…

ఇక టైటిల్ పోస్టర్ లోనే ”365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం”. ఒకవేళ అంకెలతో కాకుండా అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం” అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఓ ప్రేమ జంట మధ్య 8 ఏళ్లలో జరిగిన సంఘటనలే మూవీ అని చెప్పారు. తాజాగా ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ పోషిస్తున్న మ్యాడ్ మూవీ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె “శుద్ధి అయోధ్య”గా కనిపించనున్నట్లు తెలిపారు. “19-27 ఏళ్ల మధ్య 8 సంవత్సరాల వ్యవధిలో అనేక మంది వ్యక్తులు, భావోద్వేగాలు, ప్రదేశాలను అన్వేషిస్తూ ఆమె చేసిన ప్రయాణం. వ్యక్తిత్వం ఆమె పేరును ప్రతిబింబిస్తుంది. ఇక శుద్ధి అయోధ్య అంటే స్వచ్ఛత. ఫణీంద్ర నర్సెట్టి తో తీస్తున్న 8 వసంతాలు నుంచి అనంతిక సనీల్‌ కుమార్‌ ను శుద్ధి అయోధ్యగా పరిచయం చేస్తున్నాం” అని మైత్రీ మూవీ మేకర్స్ నెట్టింట పోస్ట్ చేసింది.

- Advertisement -

క్లాసిక్ రాబోతోందా?

ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో అనంతిక చాలా కూల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. సన్నని చిరునవ్వుతో మాయ చేస్తోంది. మస్కరా పెట్టుకున్న కళ్లతో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది. అందానికి పర్యాయపదంలా ఆలరిస్తోంది. ఇయర్ రింగ్స్ తో పాటు నోస్ పిన్.. అనంతికను మరింత అందంగా మార్చాయి. ప్రస్తుతం అనంతిక ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మూవీలో ఆమె యాక్టింగ్ అదిరిపోయేలా ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు అనంతిక ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్ కాగా, శశాంక్ మాలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్ ఇంకా ఆ కవిత్వాల క్యాప్షన్స్ ని చూసి ఆడియన్స్ ఒక క్లాసిక్ సినిమా వస్తుందేమో అని అంటున్నారు. అయితే సినిమా రీలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. బహుశా అక్టోబర్, నవంబర్ మధ్యలో ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు