Ananya Nagalla : సైబర్ మోసగాళ్ల వలలో పడ్డ తెలుగమ్మాయి.. ఏం జరిగిందంటే?

Ananya Nagalla : టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు హీరోయిన్ అయిన ఈ భామ మల్లేశం, వకీల్ సాబ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం పొట్టెల్ అనే సినిమాలో నటిస్తుంది అనన్య. ఇదిలా ఉండగా ఈ అమ్మాయి తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో పడిందట. ఈ విషయంపై తనే సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. అలాగే తనని మోసం చేయడానికి జరిగిన ప్రయత్నాలపై అనన్య స్పందించి ఏం చేసిందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిపై వివరాలు ఇలా ఉన్నాయి. మామూలుగా సైబర్ నేరాలు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఆ మోసాలని ప్రత్యక్షంగా ఎక్కువగా నియంత్రించలేరు కాబట్టి పోలీసులు కూడా, జనాలని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) విషయంలో ఇదే జరిగింది.

Ananya Nagalla said that she fell into the trap of cyber fraudsters

హీరోయిన్ కి తప్పని సైబర్ తిప్పలు…

సైబర్ నేరగాళ్ల వలలో నుండి సామాన్య ప్రజలే కాదు సెలెబ్రెటీలకు కూడా కష్టాలు తిప్పలు తప్పడం లేదు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్లను కూడా ఈ విషయంలో మోసం జరిగేది, కానీ తృటిలో తప్పించుకుంది. అందిన సమాచారం ప్రకారం అనన్యకు రీసెంట్ గా ఓ క‌స్ట‌మర్ కేర్ నెంబ‌ర్ నుంచి ఫోన్ రావ‌డం జరిగింది. అప్పుడు కస్టమర్ కేర్ నుండి త‌న ఐడీతో ఉన్న ఓ సిమ్ కార్డుతో అక్ర‌మ లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని వారు తెలిపార‌ట‌. దీంతో అన‌న్య సిమ్ ను బ్లాక్ చేస్తున్న‌ట్లుగా వారు హెచ్చ‌రించార‌ట‌. అయితే అప్పుడు ఇలా జ‌ర‌గ‌కూడ‌దంటే, ఆమె పోలీస్ వారినుండి క్లియ‌రెన్స్ తెచ్చుకోవాల‌ని వారు సూచించార‌ట‌. ఇక్కడే అసలు కథ జరిగింది. అప్పుడు అనన్య సరే అన్నాక, వెంటనే అనన్య ఫోన్ కాల్ ను పోలీసుల‌కు క‌నెక్ట్ చేస్తున్న‌ట్లుగా చెప్పి, ముంబై పోలీసుల‌మంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ క‌నెక్ట్ చేశారు. వారు పోలీస్ క్లియ‌రెన్స్ కోసం అనన్యను ముంబై రావాల‌ని వారు ఆదేశించారు.

- Advertisement -

ఫ్రాడ్ అని గుర్తించిన అనన్య పోలీసులకు పిర్యాదు..

అయితే ఇలా అనన్య తో మాట్లాడుతూ, ఆమె పై 25 అకౌంట్లు ఉన్నయని, ఆమె బ్యాంకు అకౌంట్ నుండి పోలీసులకు ఫైన్ కింద డబ్బు పంపాలని చెప్పారట. అయితే డబ్బు అనగానే అపుడే అనుమానం వచ్చిన అనన్య గూగుల్ సెర్చ్ చేయ‌గా అది ఫ్రాడ్ కాల్ అని గుర్తించింది. దీంతో అనన్య ఒక్కసారిగా వాళ్లపై ఎదురుతిరిగి తాను పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న‌ట్లుగా చెప్ప‌డంతో అవ‌త‌లి వ్య‌క్తి కాల్ క‌ట్ చేశాడ‌ట‌. దీనికి సంబంధించి అనన్య ట్విట్టర్ ద్వారా ఓ వీడియోతో షేర్ చేసుకుంది. అలాగే ఈ విషయంపై సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్పుకొచ్చింది. అలాగే జనాలని కూడా అలర్ట్ చేస్తూ, ఇలాంటి మోసాలను కనిపెడుతూ, జాగ్రత్తగా ఉండాలని అనన్య చెప్పుకొచ్చింది. ఇక అనన్య ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు