Anasuya ABout VD : విజయ్ గురించి అడిగితే మీడియాను తప్పుపట్టింది..!

Anasuya ABout VD.. ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారా భారీ క్రేజ్ దక్కించుకొని.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోని తాజాగా ఈమె నటించిన చిత్రం సింబా.. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటుచేసి.. కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

Anasuya ABout VD : When asked about Vijay, the media was wrong..!
Anasuya ABout VD : When asked about Vijay, the media was wrong..!

అనసూయ Vs విజయ్ దేవరకొండ..

ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియాతో ముచ్చటించిన అనసూయ.. విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం మీడియానే తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.. అసలు విషయానికి వెళ్తే గత కొద్ది రోజులుగా అనసూయకి, విజయ్ దేవరకొండ అభిమానులకి సోషల్ మీడియాలో మాటలు యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఎన్నోసార్లు అనసూయ ఏదో ఒక కామెంట్ చేయడం, దీనికి విజయ్ అభిమానులు ఆమె కామెంట్ కి సమాధానాలు ఇవ్వడం, ఇలా వీరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది.. బయట కూడా అనసూయ ను మీడియా వాళ్ళు ఎక్కువగా విజయ్ దేవరకొండ గురించి ప్రశ్నలు స్పందించడం జరిగింది. ఇలా ఈ ఇద్దరి మధ్య చాలాసార్లు వివాదాలు జరిగాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని సింబా ట్రైలర్ లాంచ్ లో కూడా అడిగారు మీడియా మిత్రులు.

విజయ్ విషయంలో మీడియానే తప్పు పట్టిన అనసూయ..

మీడియా మిత్రులు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ అభిమానులతో మీ గొడవ అయిపోయినట్టేనా అని అడగ్గా.. దీనికి అనసూయ మాట్లాడుతూ.. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు. ఒక సినిమా ద్వారా మంచి మెసేజ్ ఇద్దామని అనుకుంటాము.. కానీ విజయ్ సినిమాలో అలా జరగలేదు..పైగా స్టేజ్ మ్యానర్స్ కాదు అని ఒక అభిప్రాయం అంతే. ఎప్పుడైనా, ఎవరికైనా సరే ఒక గొప్ప శక్తి నుంచి మంచి బాధ్యత వస్తుంది. ఎక్కడైనా మన పైన ఫోకస్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ మనం పద్ధతిగా ఉండాలి. పద్ధతి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది.. కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తాయి. అదే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను.. ఆ విషయం మీకెందుకు ఆ సమయంలో తప్పనిపించలేదు. ఎప్పుడూ నేను అడుగుదామనుకుంటాను.. మీరందరూ మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. మీ తప్పే అది.. కానీ మీరే నన్ను తప్పుగా ప్రశ్నిస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండ విషయంలో అడిగిన మీడియా మిత్రులను తప్పుపడుతూ అనసూయ కామెంట్లు చేసింది.ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

తప్పనిపించింది చెప్పాను..

అంతేకాదు ఇదే విషయంపై విజయ్ దేవరకొండను కూడా అడిగామని మీడియా మిత్రులు చెబితే, దానికి అనసుయ మాట్లాడుతూ.. అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది. ‘ఆమెను అడగండి’ అని దాటేశారు కదా.. కానీ నేను అలా దాటే ప్రయత్నం చేయలేను.. ఎందుకంటే నేను ఎవరిని విమర్శించడం లేదు. ఆ పరిస్థితి అక్కడ ఏర్పడింది కాబట్టి నాకనిపించింది ఇది కరెక్ట్ కాదు అని.. అందుకే అర్జున్ రెడ్డి సినిమా విషయంలో నేను చెప్పాల్సి వచ్చింది అంటూ అనసూయ క్లారిటీ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు