Anasuya : ఈ కొత్త అవతారం ఏంటి యాంకరమ్మ… ఎప్పుడూ చూడలే ఇలా

Anasuya : టాలీవుడ్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా తెగ బిజీ అవుతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పుడెప్పుడో టెలివిజన్ లో న్యూస్ ఛానల్ లో వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయింది. ఆ తర్వాత అలాంటి ఎంటర్టైన్మెంట్ షో లతో బిజీ అవుతూ, ఇప్పుడు సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేసింది. ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరమై పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసింది. అయితే సినిమాల్లోనూ క్షణం, రంగస్థలం, పుష్ప, రీసెంట్ గా రజాకార్ వంటి చిత్రాల్లో తన నటనా ప్రతిభ తో ఆకట్టుకుంది అనసూయ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలు అంటుకుంటూ అప్పుడప్పుడూ హాట్ ఫోజులతో నెట్టింట కూడా వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అనసూయ సినిమాల కంటే వివాదాల తోనే ఎక్కువ ఫేమస్ అయిందని తెలిసిందే. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా వివాదం మొదలుకొని మొన్న మొన్న వచ్చిన రజాకార్ వంటి సినిమాల వరకూ ఏదో ఒక వివాదాస్పద అంశాలపై మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటుంది.

Anasuya bharadwaj at temple pics wiral on social media

గుడిలో అనసూయ… పేరును సార్ధకం చేసుకోడానికా?

ఇక యాంకర్ అనసూయ వివాదాలతో, సినిమాలతో ఎంత ఫేమస్ అయిందో ఫోటోషూట్లతో కూడా అంతే ఫేమ్ సంపాదించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ హాట్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఏకంగా బికినీ షోలతో నెట్టింట వైరల్ అయ్యి ట్రోలర్లకి బుక్ అయింది. పెళ్ళై పిల్లలున్నా తగ్గేదేలేదంటూంటుంది. సినిమాలు ఎలాగో, తన ఫోటోషూట్లు అలాగే అంటూ ఇంస్టాగ్రామ్ లో ఘాటు ఫోజులతో వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటిది అనసూయ సడన్ గా ఈరోజు గుడిలో ఉన్న ఫొటోలతో దర్శనమిచ్చింది. తాజాగా యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న అనసూయ గుడి ప్రాంగణంలో కూర్చుని కొన్ని ఫొటోలు అప్లోడ్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు ఎప్పుడూ ఇలా కూల్ గా పద్దతిగా ఉండొచ్చుగా.. ఇలా ఉంటే వివాదాలు, ట్రోలర్లు నీ జోలికి రారుగా అనసూయా… అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

వరుస సినిమాలతో బిజీ…

ఇక అనసూయ (Anasuya) లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అవి చూసిన కొంతమంది నెటిజన్లు ఈ యాంకరమ్మ కొత్త అవతారమేంటి? ఎప్పుడూ చూడలేదు… కొత్తగా ఇలా తయారయిందేంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ ఇలా అన్ని రకాల పోస్ట్ లు పెడుతూ వైరల్ కావడానికి మాత్రం ప్రయత్నిస్తుంటుంది. ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పలు చిన్న సినిమాల్లో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతుంది. ఇక అనసూయ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తుందని సమాచారం. ఇక ఈమె నటిస్తున్న పుష్ప ది రూల్ లో ఫస్ట్ పార్ట్ లో ఉన్న దాక్షాయణి పాత్రను రెండో పార్ట్ లో కూడా కంటిన్యూ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు