Anasuya Bharadwaj: ఆసుపత్రిలో చేరిన అనసూయ..!

Anasuya Bharadwaj Health Update: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అతి కొద్ది మంది యాంకర్లు మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం… యాంకర్ గానే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ నటిగా రాణిస్తూ ఉంటారు. అలాంటి యాంకర్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. యాంకర్ సుమ, శ్రీముఖి, అనసూయ భరద్వాజ్, యాంకర్ రష్మీ లాంటి వారు ఎంతోమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గానే కాకుండా సినిమాలలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

అయితే ఈ అందరి యాంకర్లలో అనసూయ భరద్వాజ్ కు మంచి బ్రాండ్ ఉంది. ఈ యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమా చేయాలంటే గట్టిగానే డబ్బులు వసూలు చేస్తోంది. అందరి యాంకర్ల కంటే ఈ బ్యూటీకి ఎక్కువగా ఇండస్ట్రీలో ఛాన్సులు కూడా వస్తున్నాయి. వాస్తవానికి తన కెరీర్ జబర్దస్త్ కారణంగా ఈ స్థాయికి వచ్చింది. జబర్దస్త్ లో యాంకర్ గా దాదాపు 10 సంవత్సరాల పాటు అనసూయ భరద్వాజ్ పనిచేశారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు వస్తున్న నేపథ్యంలో… ఈ బ్యూటీ… జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేశారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అనసూయ భరద్వాజ్. పుష్ప, విమానం, లాంటి ఎన్నో బంపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది అనసూయ భరద్వాజ్. అలాగే సోషల్ మీడియాలో తన అందచందాలను నిత్యo మారబోస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా టాలీవుడ్ హీరోలను కూడా గెలుకుతూ శునకానందం పొందుతూ ఉంటుంది అనసూయ భరద్వాజ్.

- Advertisement -

ఇది ఇలా ఉండగా తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అనసూయ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనారోగ్య సమస్యల గురించి ఆమె వెల్లడించారు. మీ అందం అలాగే పర్సనాలిటీ వెనుక రహస్యం ఏంటని యాంకర్ అడిగితే అనసూయ భరద్వాజ్ షాకింగ్ విషయాలు తెలిపారు. అయితే తను అందం కోసం ఎలాంటి ఎక్సర్సైజ్ గాని డైట్ కానీ మైంటైన్ చేయడం లేదని అనసూయ భరద్వాజ్ వెల్లడించారు. కానీ ఏదైనా సమస్య వచ్చినా.. ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పిన తనకు కాస్త ఆందోళన ఉంటుందని ఆమె వెల్లడించారు.

తనకు బ్రీతింగ్ సమస్య విపరీతంగా వస్తుందని… దానివల్ల చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లి ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని వివరించారు. భావోద్వేగానికి గురైతే కండరాలలో నొప్పులు కూడా వస్తాయని ఆమె స్పష్టం చేశారు. అయితే వీటన్నిటిని తొలగించుకునేందుకు యోగ మాత్రం చేస్తానని అనసూయ చెప్పుకొచ్చారు. దీంతో అనసూయ ఆసుపత్రి చేరినట్లు కొంతమంది ఆమె పడని వారు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు