Anasuya : ఆ పని రోజు చేయాలనీ ఉంటుందట.. కానీ?

Anasuya : టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక చిన్న న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ, ఆ తర్వాత జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు ఎంటర్టైన్మెంట్స్ షో లకు హోస్ట్ గా చేస్తూ బిజీ అయింది. ఈ క్రమంలోనే సినిమాల్లో ఆఫర్లు రాగా అక్కడ కూడా మంచి రోల్స్ దక్కించుకుని క్లిక్ అయింది. ప్రస్తుతం అనసూయ పుష్ప ది రూల్ సినిమాతో బిజీ గా ఉంది. ఇదిలా ఉండగా అనసూయ ఈ కామెడీ షోలు, సినిమాల కంటే వివాదాలు, ట్రోల్స్ తోనే ఎక్కువసార్లు వార్తల్లో నిలిచింది అని తెలిసిందే. వారానికి ఒక్కసారైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది అనసూయ. పైగా ఎన్ని నెగిటివ్ ట్రోల్స్, కామెంట్లు వచ్చినా ఈ యాంకరమ్మ అస్సలు తగ్గడం లేదు.ట్రోలర్లకు గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లతో చిట్ చాట్ చేయగా అందులో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.

Anasuya Bharadwaj Intresting Comments on Gym

ఆ పని రోజు చేయాలనీ ఉంది – అనసూయ

ఇక తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేయగా, అందులో నెటిజన్లతో తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అందులో భాగంగా ఓ నెటిజన్ అనసూయను మీరు రోజూ జిమ్ చేస్తారా అని అడిగాడు. దానికి బదులుగా అనసూయ అనుకోని విధంగా రిప్లై ఇచ్చింది. అనసూయ జిమ్ గురించి ప్రస్తావిస్తూ… ఇలా చెప్పుకొచ్చింది. నాకు ప్రతిరోజూ జిమ్ చేయాలనీ ఉంటుంది. కానీ కొన్నిసార్లు వేరే పనుల వల్ల, నా ట్రైనర్ షెడ్యూల్స్ వాళ్ళ కుదరదు. కానీ కనీసం వారం లో 3 సార్లైనా పక్కా చేయడానికి ట్రై చేస్తానూ.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ కామెంట్ కి నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ చిట్ చాట్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని చెప్పుకొచ్చింది.

- Advertisement -

పవర్ స్టార్ తో సినిమా..

ఇక అనసూయ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా కూకూడా చేసానని అది రిలీజ్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సెట్స్ పై పవన్ నటించే మూడు సినిమాల్లో ఏ సినిమా అయి ఉంటుందో మరి. అలాగే ఒక నెటిజన్ రంగస్థలం సినిమా తరవాత మీరు రంగమ్మత్త గా పాపులర్ అయ్యారు. అందుకే అత్త అని పిలిస్తే యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాడు. దానికి అనసూయ ఆర్ యూ క్రేజీ అంటూ.. తప్పకుండా.. అంటూ రిప్లై ఇచ్చింది. అలా అనసూయ స్పందించిన కొన్ని విషయాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం పుష్ప ది రూల్ మాత్రమే కాకుండా, ఓ రెండు తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తుంది అనసూయ. ఆ సినిమాలు క్లిక్ అయితే అక్కడ కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు