Anasuya: ఫారెస్ట్ లో అనసూయ.. అలాంటి పనులు చేస్తూ బుక్ అయింది గా !

anasuya bharadwaj vacation with family: టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది అన్న సంగతి తెలిసిందే. ఈ ఇండస్ట్రీలో ఎన్నో రకాల నటీనటులు వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నటీనటులు వివిధ రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అవుతున్నారు. ఎక్కడ చూసిన వేళ్ళతో లెక్కపెట్టలేనంతమంది నటీనటులు ఉన్నారు. అందులో యాంకర్ల పాత్ర చాలా కీలకం. అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు.

అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటివారులో అనసూయ భరద్వాజ్ ముందు వరుసలో ఉంటారు. యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే పాపులారిటీని సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్ గా, అలాగే నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది అనసూయ. ఓవైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది అనసూయ భరద్వాజ్.

మొదటగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ న్యూస్ రీడర్ గా కెరిర్ మొదలుపెట్టింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత జబర్దస్త్ లోకి యాంకర్ గా అరంగేట్రం చేసింది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ లో యాంకర్ గా దాదాపు 9 సంవత్సరాల పాటు కొనసాగుతూ స్టార్ యాంకర్ గా పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంది అనసూయ భరద్వాజ్. అంతేకాకుండా సినిమాలలో మంచి పాత్రలను పోషిస్తూ స్టార్ యాక్ట్రెస్ గా పేరు సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అనసూయ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో అభిమానులను ఫిదా చేస్తోంది.

- Advertisement -

అల్లు అర్జున్ “పుష్ప టు ది : రూల్ ” లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనసూయ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా అనసూయ తన బర్త్ డే పుట్టినరోజుని చాలా సింపుల్ గా జరుపుకుంది. ప్రకృతి అందాలలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. అయితే పుట్టినరోజు వేడుకలలో భాగంగానే ఇప్పుడు కూడా టూర్ లోనే ఉంది అనసూయ. తన కుటుంబంతో కలిసి పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వేడుక చేసుకుంది.

సెలయేర్లు, కొండల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకను జరుపుకుంది. ఈ సందర్భంగా తనలో ఉన్న అందాన్ని సైతం అదే స్టైల్ లో హైలైట్ చేసింది అనసూయ భరద్వాజ్. గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి థైస్ అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం అనసూయ థైస్ షో చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు