Anasuya: అతనితో క్లోజ్‌ అవుతోన్న అనసూయ…ఫోటోలు వైరల్‌?

Anasuya:  యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనసూయ వరుసగా షోలలో యాంకర్ గా అవకాశాలను అందుకుంది. ఇక ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో నటించి ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నటువంటి అనసూయ యాంకరింగ్ కి కాస్త దూరంగా ఉంటూ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ పాన్ ఇండియా మూవీ పుష్ప-2 లోను ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత అనసూయ మళ్ళీ బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో అనసూయతో కలిసి ప్రముఖకొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

ఇక రీసెంట్ గా వీరిద్దరూ ఈ షోలో కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా శేఖర్ మాస్టర్ తో కలిసి కొన్ని ఫోటోలను దిగింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోగా చాలామంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత చిన్న పొట్టి దుస్తులు వేసుకోవడం అవసరమా…. ఇద్దరు పిల్లల తల్లివి కాస్త డ్రెస్సు నిండుగా వేసుకోవచ్చు కదా అని కొంతమంది కామెంట్లు చేయగా….మరికొందరేమో శేఖర్ మాస్టర్ కి అనసూయ చాలా దగ్గరగా అవుతుందని అందుకే అంత క్లోజ్ గా ఫోటోలు దిగింది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు