Anasuya: విజయ్ దేవరకొండ కొండ ఫ్యాన్స్ చేతకాని వాళ్లు

Anasuya: నువ్విలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో కొన్ని పాత్రలలో కనిపించిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి అనే పాత్రతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ అలానే విజయ్ దేవరకొండ ఇద్దరికీ మంచి పేరుతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక విజయ్ కి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గర అయిపోయాడు విజయ్.

పెళ్లిచూపులు సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయమైన అర్జున్ రెడ్డి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు విజయ్. అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమా ఒక సంచలనం ఇప్పటికీ ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆ సినిమా వివాదాలతో మొదలై అద్భుతమైన విజయాన్ని సాధించుకుంది. సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. ఆ సినిమా గురించి డిబేట్లు కూడా నడిచాయి. అయితే ఈ సినిమాలో ఒక వర్డ్ యూస్ చేసినందుకు విజయ్ దేవరకొండ ను చాలా మంది టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అందులో అప్పటికే బుల్లితెర జబర్దస్త్ అనే షో ద్వారా గుర్తింపు సాధించుకున్న అనసూయ కూడా ఉన్నారు.

Anasuya Bharadwaj

- Advertisement -

ఇక అప్పటి నుంచి అనసూయ కి విజయ్ దేవరకొండ కి మధ్య వారు జరుగుతూనే ఉంది. ప్రతిసారి విజయ్ సినిమా రిలీజ్ అయిన అనసూయ సినిమా రిలీజ్ అయిన ఈ ఇష్యూ గురించి ఇద్దరినీ ప్రశ్నిస్తూ ఉంటారు మీడియా జర్నలిస్టులు. ఇక రీసెంట్ గా కూడా ఒక జర్నలిస్ట్ ఈ విషయం గురించి మాట్లాడమని అనసూయని అడిగినప్పుడు. మీరు నన్ను మాత్రమే అడుగుతారు తనని అడగరు అంటూ సదరు జర్నలిస్టు మీద కూడా అనసూయ ఫైర్ అయింది.

ఇకపోతే వివాదం సర్దుకుంది అనుకున్న టైంలో మరోసారి ట్విట్టర్ వేదికగా విజయ్ ఫ్యాన్స్ ను ట్రోల్ చేయటం మొదలుపెట్టింది అనసూయ. మరీ ఇంత చేతకాని వాళ్ళ లాగా ఉంటే ఎలాగండి, నిజంగా మీకు కాలుతుంది అంటే నా మీద కాదు… అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్లని అనండి దమ్ముంటే… కానీ మీరు అలా చేయరు కదా.. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరో లాగా ఆడవాళ్ళను ఉద్దేశించి బూతులు తిట్టటం మాత్రమే వచ్చు, గెట్ వెల్ సూన్ అండ్ గెట్ రియల్ జాబ్. గుడ్ నైట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు