Anasuya: అనసూయ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా… పొద్దున్నే అది ఉండాల్సిందే

Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా వెండితెరకు పరిచయమైంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా నిలిచింది అనసూయ.

జబర్దస్త్ వంటి టాప్ షోలలో యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత పలు షోలలో నటించి సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అనసూయ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తోంది ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప2 లోనూ మంచి పాత్రను పోషిస్తుంది.

- Advertisement -

ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ వెకేషన్ లో దిగిన కొన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఏ మాత్రం తరగని అందం, ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా అనసూయ తన అందానికి గల కారణాన్ని తెలియజేస్తూ ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో మెంతితో తయారుచేసిన హాట్ వాటర్ ని తాగుతూ నా అందానికి సీక్రెట్ ఇదేనంటూ తెలియజేసింది. ప్రతి ఒక్కరూ మెంతితో తయారుచేసిన నీటిని తాగండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు