Anasuya : బుల్లితెరపై బాడీ బిల్డప్.. నెటిజన్ల ఫైర్.. అయినా యాంకరమ్మ తగ్గట్లేదు!

Anasuya : టాలీవుడ్ లో ఉన్న ఫేమస్ యాంకర్లలో అనసూయ ఒకరు. అయితే ఈమె తన యాంకరింగ్ కన్నా, గ్లామర్ షో తోనే ఎక్కువ ఫేమస్ అయింది. పైగా వివాదాలకు కూడా దగ్గరగానే ఉంటుంది. నిజానికి వివాదాలతోనే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అనసూయ బాగా తెలిసింది. అయితే ఇప్పుడు సినిమాల్లో ఆర్టిస్ట్ గా క్లిక్ అయి మంచి ఆర్టిస్ట్ గా బిజీ అయింది. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీ గా ఉంది. ఇదిలా ఉండగా అనసూయ మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, వచ్చే నెగెటివ్ కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ యాంకరమ్మ కూడా ట్రోలర్లకు గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటుంది. ఒకానొక టైంలో అయితే ఆంటీ అంటూ అనసూయను దారుణంగా ట్రోల్ చేశారు. అప్పట్లో అనసూయకు మండేలా ఆంటీ అనే పదాన్ని నేషనల్ వైడ్‌గా ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. అలా అనసూయకు, నెటిజన్లకు ఎప్పుడూ ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మళ్లీ అనసూయ (Anasuya) కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచింది.

Anasuya's body building show in a television show

బుల్లితెరపై బాడీ బిల్డప్.. ఏంటి వేషాలు..

అయితే అనసూయ సినిమాల్లో బిజీ అవడం వల్ల బుల్లితెరపై దూరమయింది. కానీ ఇన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చిన అనసూయ మళ్లీ మెరిసింది. ఇక ఇప్పుడు మళ్లీ అనసూయ బ్యాక్ టు హోం అన్నట్టుగా బుల్లితెరకు వచ్చింది. స్టార్ మాలో కొత్త షోలో అనసూయ, శేఖర్ మాస్టర్‌లు సందడి చేశారు. ‘కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్’ అంటూ కొత్త షోలో ఈ ఇద్దరూ సందడి చేశారు. బాయ్స్ టీంకు శేఖర్ మాస్టర్, గర్ల్స్ టీంకు అనసూయ ప్రతినిధిగా ఉన్నారు. ఈ ఇద్దరూ జడ్జ్‌లుగా ఉంటే.. శ్రీముఖి హోస్ట్‌గా షోను ముందుకు తీసుకెళ్తోంది. బుల్లితెర సెలెబ్రిటీలతో సాగే ఈ షో ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రోమోలో చివర్లో అనసూయ తన ఒంటి మీద వేసుకున్న జాకెట్ ని దాన్ని తీసేసింది.. శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ విప్పేశాడు. ఈ ఇద్దరూ ఏదో బాడీ బిల్డప్ పోటీకి రెడీ అయినట్టుగా ప్రోమోను ఎండ్ చేశారు. ఇలా అనసూయ తాను వేసుకున్న దాన్ని విప్పేయడంతో నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అంటూ జనాలు ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు.

- Advertisement -

నెటిజన్ల ఫైర్.. యాంకరమ్మ ఘాటు రిప్లై…

ఇక నెట్టింట ఈ వీడియో పై వస్తున్న ట్రోలింగ్ కి అనసూయ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అనసూయ స్పందిస్తూ… ‘కాలం మారుతోంది.. ఆడియెన్స్ టేస్ట్ మారుతోంది.. మేం వినోదరంగంలో ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్న తెరకే పరిమితం అండి.. పెద్ద తెర మీద ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా.. మీరు బ్లాక్ బస్టర్ చేస్తారు.. షో అంతా చూసేదాక కూడా ఆగడం లేదు.. జడ్జ్మెంట్లు ఇస్తున్నారు..అది జస్ట్ ప్రోమో.. దాని ముందు, వెనక స్టోరీ మీకు తెలీదు.. అక్కడ అయినా అంత ఇబ్బందికరంగా ఏముందో.. అది వారి వారి లిమిట్స్‌కి పరిమితం కదండి.. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే.. నేను ఏం అంటున్నానో, చెప్పదల్చుకుంటున్నానో అర్థం అవుతుందనుకుంటా”… అని అనసూయ ట్రోలర్లకి గట్టి రిప్లై ఇచ్చింది. ఏది ఏమైనా బుల్లితెరపై ఊళ్లలో ఫ్యామిలీస్ చూసే వాళ్ళకి ఇది కాస్త ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. మరి అనసూయ అన్నట్టు పూర్తి వీడియో వస్తే ఏమైనా క్లారిటీ వస్తుందేమో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు