Anchor Rashmi: అరుదైన వ్యాధి బారిన పడ్డ రష్మీ… అందోళనలో బుల్లితెర అభిమానులు..!

Anchor Rashmi.. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూనే.. తన గ్లామర్ తో యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.. జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈమె.. పలు సినిమాలలో బోల్డ్ రోల్స్ చేసి మరింత ఫేమస్ అయ్యింది.. అయితే రష్మీపై ఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. చాలామంది నెగటివ్ కామెంట్లు చేస్తూ పంచులు చేసినా సరే.. రష్మి మాత్రం పాజిటివ్ గా స్పందిస్తూ.. ఎక్కువగా వివాదాలకు చోటు ఇవ్వదని చెప్పవచ్చు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో యానిమల్స్, పెట్ డాగ్స్ విషయంలో మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది.. ఎక్కడైనా సరే మూగ ప్రాణులకు అన్యాయం జరిగిందంటే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతూ.. తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది.. ఈ క్రమంలోనే ఈ విషయాలలో ఈమె ట్రోల్స్ చేయబడుతూ ఉంటుందని చెప్పవచ్చు..

అరుదైన వ్యాధి బారిన పడ్డ రష్మీ..

Anchor Rashmi: Rashmi who is affected by a rare disease... TV fans are worried
Anchor Rashmi: Rashmi who is affected by a rare disease… TV fans are worried

ఇదిలా ఉండగా ప్రతి విషయంపై కూడా పాజిటివ్ గా స్పందించే రష్మి.. ఇప్పుడు ఒక అరుదైన వ్యాధికి గురైందట.. ఈ వ్యాధితో రష్మీ చాలాకాలంగా బాధపడుతోందని సమాచారం.. అదేమిటంటే రుమటాయిడ్ సమస్య. అంటే ఇదొక ఆటో యూనియన్ సమస్య.. దీని కారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగడం, తగ్గడం లాంటివి చేస్తూ ఉన్నట్లు సమాచారం.. అయితే ఇటీవల ఈ విషయంపై ఒక నెటిజన్ రష్మిని ప్రశ్నించింది.. తన భర్త కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడు అని.. దానికి చికిత్స ఏమిటి? అని అడిగింది.. దీనికి రష్మీ రియాక్ట్ అవుతూ.. ఇటీవల తాను కూడా ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా స్టెరాయిడ్స్ తీసుకున్నానని.. ముఖ్యంగా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి 12 ఏళ్ల వయసులోనే.. తీవ్రంగా నొప్పి ఉండే ఇంజక్షన్లు తీసుకున్నానని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే తనకు 12 సంవత్సరాల వయసులోనే ఈ వ్యాధి ఉందని ఆమె స్వయంగా వెల్లడించింది..

చిట్కాలు ఇవే..

ఇక దీనికి చిట్కాగా నెగిటివిటీకి దూరంగా ఉండాలని.. పాజిటివ్ మైండ్ తో ఉండాలని.. ఒత్తిడిని తగ్గించుకోవాలని… నెగిటివ్గా మాట్లాడే వాళ్లకు.. నెగిటివ్ ఆలోచనలు చేసే వాళ్లకు .. ఎవరైనా ముందుకు వెళ్తుంటే వెనక్కి నెట్టాలని చూసే వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పింది రష్మి.. అయితే ఈ విషయం ఆరేళ్ల క్రితం నాటిది.. మరి ప్రస్తుతం రష్మి ఆరోగ్యం అలాగే ఉందా లేక కుదుటపడిందా అనే విషయంపై మాత్రం రష్మీ క్లారిటీ ఇవ్వలేదు..

- Advertisement -

ఆందోళనలో అభిమానులు..

ఇక రష్మీకి ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి అభిమానుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బుల్లితెర అభిమానులు.. తన అభిమాన యాంకర్ కు ఇలాంటి వ్యాధి ఉంది అని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే రష్మీ ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ విషయం తెలిసిన అభిమానులు, బుల్లితెర సెలబ్రిటీలు, వెండితెర సెలబ్రిటీలు కూడా త్వరగా కోలుకోవాలని.. సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు