Anchor Ravi: నటి లహరితో నాకున్న బంధం అదే…!

Anchor Ravi.. బుల్లితెర ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మేల్ యాంకర్లలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యాంకర్ రవి కూడా ఒకరు.. కొరియోగ్రాఫర్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చిరంజీవి రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.. అందులో భాగంగానే ఎంతోమంది సెలబ్రిటీలకు డాన్స్ నేర్పిస్తూ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో అమల పరిచయమయ్యింది అమలా నుంచి నాగార్జున కూడా పరిచయం అవ్వగా ఆయనతో తాను స్టార్ హీరో అవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారట.. అయితే నాగార్జున మాత్రం రవి చురుకుదనాన్ని గమనించి.. స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సంథింగ్ స్పెషల్ షో లో యాంకర్ అవకాశం కల్పించారు.. ఇక ఈ షో లో మొదటిసారి మరో లేడీ యాంకర్ లాస్యను తీసుకొచ్చి మరింత సక్సెస్ చేశారు.. అలా యాంకర్ గా చేస్తున్నప్పుడే జీవితం అర్థమయిందని.. ఇక ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కొని పేరు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవి వెల్లడించిన విషయం తెలిసిందే ఆ ఇంటర్వ్యూలో భాగంగానే తనకు నటి లహరి షెరి తో ఉన్న రిలేషన్ పై కూడా ఓపెన్ అయ్యారు రవి.

నటి లహరి షెరి తో వున్న బంధం అదే..

Anchor Ravi: My relationship with actress Lahari is the same...!
Anchor Ravi: My relationship with actress Lahari is the same…!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అటు యాంకర్ రవి ఇటు లహరి షెరి ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించారో అందరికీ తెలిసిందే.. అంతే కాదు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి నిజంగా ఏదో ఉందనే వార్తలు కూడా వినిపించాయి.. పైగా అర్ధరాత్రుల వరకు వీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం.. చాలా క్లోజ్ గా ఉండడం వంటివి చేశారు.. అయితే సినీ నటి శైలజ ప్రియ వీరి బంధం పై హౌస్ లో ఉన్నప్పుడే కామెంట్లు చేసింది.. ప్రతి ఒక్కరి బర్తడే కి ఏదో ఒక సర్ప్రైజ్ రాగా.. రవి బర్తడే కు మాత్రం ఏది రాలేదు. దీనితో రవి ఫీల్ అవుతుండగా.. ఆమె వచ్చి మీ ఇద్దరినీ ఇలా చూసి నిత్య ఏమైనా ఫీలయి ఉండొచ్చని చెప్పిందట.. అయితే అప్పుడు ఏదో కోపంలో తాను అన్న మాటను శైలజ ప్రియా నామినేషన్ లో తీసి లహరి షేరి తో తన రిలేషన్ గురించి గట్టిగా మాట్లాడగా.. అవి చాలా హైలెట్ అయ్యాయని రవి చెప్పాడు.. అయితే హౌస్ లో ఉన్నప్పుడే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా తామద్దరం మంచి స్నేహితులమని.. ఇప్పటికీ చాలా క్లోజ్ గానే ఉంటామని రవి వెల్లడించారు. మొత్తానికైతే నటి శైలజ ప్రియా చేసిన కామెంట్లపై క్లారిటీ ఇస్తూ తాము మంచి స్నేహితులమని స్పష్టం చేశారు రవి.

ఇక లహరి షెరి విషయానికి వస్తే..

మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.. ఆ తర్వాత అదే ఏడాది మళ్లీ రావా, పటేల్ ఎస్ ఐ ఆర్, అజ్ఞాతవాసి – ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ , పేపర్ బాయ్ , తిప్పరా మీసం వంటి పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.. ఇక తన అద్భుతమైన నటనతో పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లో కూడా తన పర్ఫామెన్స్ తో అందరినీ అలరించింది.. అయితే ప్రస్తుతం అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కెరియర్లో ముందుకు వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు