Utsavam : నేను స్టేజ్ పై ఇన్ని నాటకాలేస్తున్నానంటే దానికి కారణం అదే – సుమ సంచలన వ్యాఖ్యలు

Utsavam : టాలీవుడ్ లో అంతరించిపోతున్న నాటక రంగం, కళాకారుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్ లో సురేష్ పాటిల్ నిర్మించారు. దిలీప్ ప్రకాష్ హీరో గా నటించిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది. అయితే నాటక రంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో 90స్ కి చెందిన భారీ తారాగణం ఇందులో నటించడం జరిగింది. 90స్ లో పేరు మోసిన నటీనటులు చాలా మంది ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. సుమ హోస్ట్ గా వ్యవహరించగా, స్టేజ్ పై యాంకర్ సుమ (Suma) ఉత్సవం సినిమా గురించి ప్రస్తావిస్తూనే తన కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Anchor Suma sensational comments about his career

నేను స్టేజ్ పై ఇన్ని నాటకాలేయడానికి కారణం – సుమ

ఉత్సవం (Utsavam) సినిమా గురించి సుమ ప్రస్తావిస్తూ.. నాటక రంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వస్తున్న చిత్ర యూనిట్ ని అభినందిస్తూ.. తన కెరీర్ గురించి కూడా చెప్పుకొచ్చింది. సుమ మాట్లాడుతూ… చాలామంది నాటకాలు వేసాక సినిమాల్లోకి, టెలివిజన్లోకి వస్తారు… కానీ తాను మాత్రం టెలివిజన్ లోకి వచ్చాక నాటకాల్లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది సుమ. ఈరోజు తాను స్టేజి మీద ఇన్ని నాటకలేస్తున్నానంటే దానికి కారణం తనది కూడా స్ట్రాంగ్ బేస్ నాటకాలే నాని చెప్పుకొచ్చింది. ఇక తన న్తాటకరంగం గురించి చెప్తూ… పుత్రకామేష్టి అనే నాటకం లో కొరలమ్మ పాత్ర వేసిన నేను, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, కోల్కతా లో సైతం ప్రదర్శించి నేషనల్ అవార్డ్స్ కూడా అనుకున్నానని చెప్పుకొచ్చింది సుమ. ఇదే కాకుండా రేపటి మహిళ, సంఘం మారాలి లాంటి నాటకాలు వేస్తూ.. ఆ నాటకాల అనుభవంతోనే స్టేజ్ పై ఇంత ధైర్యంగా నిల్చున్నానని చెప్పుకొచ్చింది సుమ.

- Advertisement -

రిలీజ్ కి రెడీ అయిన ఉత్సవం..

ఇక ఉత్సవం సినిమా దాదాపు ఏడాది కిందే షూటింగ్ ఫినిష్ అయినా, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల, సినిమాల పోటీ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతుంది. క ఈ సినిమాలో 90స్ కి చెందిన ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం (Bramhanandam), అలీ, ప్రేమ, సుధ, ఆమని, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, పృథ్వీ తో పాటు యంగ్ నటులు ప్రియదర్శి, రచ్చ రవి వంటివారు కీలక పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో ఈ సినిమా ఎంతవరకు జనాలను మెప్పిస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు