Anchor Suma: సుమా ఎమోషనల్ వీడియో వైరల్.. ఏమైందంటే..?

Anchor Suma.. బుల్లితెర ఇండస్ట్రీలో తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతోమంది ఆడియన్స్ ను తన అభిమానులుగా మార్చుకున్న సుమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు టీవీ షోలు, ఇటు ఆడియో రిలీజ్ లు, ఫ్రీ రిలీజ్, సక్సెస్ మీట్స్ ఇలా ఏవైనా సరే సుమ ఉండాల్సిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫన్నీ వీడియోలు చేస్తూ..తనకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉండే ఈమె తాజాగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసి అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.. మరి సుమా షేర్ చేసిన ఆ వీడియో ఏంటి అందులో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Anchor Suma: Suma's emotional video went happened..?
Anchor Suma: Suma’s emotional video went happened..?

డాక్టర్స్ డే సందర్భంగా ఎమోషనల్ వీడియో..

తాజాగా డాక్టర్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది.వైద్యుల సేవలకు వారి సహనానికి కృతజ్ఞతలు తెలిపింది.. ఇక సుమ షేర్ చేసిన వీడియోలో ఏముంది అంటే.. ఒక రోగి డాక్టర్ దగ్గరకు వెళుతుంది.. తన బాధను చెప్పుకోవడంతో.. ఆ డాక్టర్ మందులు రాసి ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేయమని చెబుతుంది.. దీంతో రోగి అర్ధరాత్రి తనకు ఫోన్ చేస్తుంది.. దాంతో ఏంటి ఎమర్జెన్సీ ఏమైనా ఉందా? అంటే లేదు రోజుకు రెండుసార్లు టాబ్లెట్ వేసుకోమన్నారు కదా.. అది పొద్దునా.. మధ్యాహ్నమా లేక మధ్యాహ్నం.. సాయంత్రమా లేక రాత్రి.. ప్రొద్దునా అని అడిగింది.. దీంతో ఎలాంటి విసుగు లేకుండా సమాధానం ఇవ్వడమే కాదు జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది కూడా.. ఇకపోతే ఈ వీడియోలో పేషంట్, డాక్టర్ రెండు పాత్రలు కూడా సుమా చేయడం విశేషం. ఇక ఇలా పేషంట్ ఎంత సతాయించినా.. ఏ టైం లో ఫోన్ చేసినా.. డాక్టర్ ఓపికగా సహనంగా సమాధానం చెప్పి.. వారి యొక్క గొప్పతనాన్ని మరొకసారి చూపించింది.. నిజానికి డాక్టర్స్ దేవుళ్ళు అని అనడంలో సందేహం లేదు.. ఏ సమయం అయినా సరే ఒక ప్రాణాన్ని కాపాడడానికి తమ కుటుంబాలను తమ జీవితాన్ని సైతం పణంగా పెడుతూ ఉంటారు.. అందుకే వారి కోసమే ప్రత్యేకంగా ఈ డాక్టర్స్ డే ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్లకు సంబంధించిన ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోందని చెప్పవచ్చు.

సుమ కెరియర్..

ఇక సుమ కనకాల విషయానికి వస్తే.. యాంకర్ గా సత్తా చాటు తూనే నటిగా కూడా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో బాడీ లాంగ్వేజ్ తో అందరిని కడుపుబ్బా నవ్వించే ఈ ముద్దుగుమ్మ.. స్టార్ సెలబ్రిటీలు సైతం ఈమె యాంకరింగ్ కు ఫిదా అవుతారు. ఇకపోతే ఈమె భర్త రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే.. మరొకవైపు ఈమె కొడుకు రోషన్ కనకాల కూడా ఇటీవలే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు.. అయితే బబుల్గం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న రోషన్ కనకాల.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ కాన్సెప్ట్ తో ఇండస్ట్రీలోకి వస్తారో చూడాలి. మొత్తానికైతే సుమ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు