Anchor Syamala: శ్యామలకు కీలక పదవి.. జగన్ ఊహించని నిర్ణయం..!

Anchor Syamala : ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది సినీ సెలబ్రిటీలు కూటమికి సపోర్టు చేస్తే, మరి కొంతమంది సెలబ్రిటీలు వైసిపి పార్టీకి సపోర్టు చేశారు. అలా వైసిపి పార్టీకి మద్దతుగా నిలిచిన వారిలో యాంకర్ శ్యామల (Anchor Syamala) కూడా ఒకరు. నిజానికి ఈమె 2019 కంటే ముందు నుంచి కూడా వైసిపికి మద్దతుగా నిలుస్తూ వస్తోంది. అయితే ఈ సారి తమ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది శ్యామల.

పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ శ్యామల..

ఇక అలా వైసీపీకి సపోర్ట్ చేస్తుందన్న కారణంతో కొంతమంది టీడీపీ కూటమి వర్గాల వారు శ్యామలను డైరెక్ట్ గా టార్గెట్ కూడా చేశారు. దానిని భరించలేక.. భయం వేస్తోందని, రకరకాల ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తాను పార్టీ కోసమే చేస్తున్నాను తప్ప కక్షపూరితంగా ఎవరిని నిందించడం లేదు అంటూ వేడుకుంది. ఇక పార్టీ గెలుపు కోసం ఎంతో ప్రయత్నం చేసింది కానీ పార్టీ గెలవలేకపోయింది. ఇదిలా ఉండగా తాజాగా పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని దృష్టిలో పెట్టుకొని, వారందరికీ కీలక పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.

యాంకర్ శ్యామలకు కీలక పదవి…

అందులో భాగంగానే పార్టీలో పలువురికి కీలక బాధ్యతలను అప్పగించారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గా జగన్ నియమించారు. అలాగే తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్ష బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించడం జరిగింది. అంతేకాదు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా యాంకర్ శ్యామల, ఆర్కే రోజా, జూపూడి ప్రభాకర్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -
Anchor Syamala: Key position for blacks.. Jagan's unexpected decision..!
Anchor Syamala: Key position for blacks.. Jagan’s unexpected decision..!

శ్యామల కెరియర్..

శ్యామల కెరియర్ విషయానికి వస్తే.. పలు సీరియల్స్ లో, సినిమాలలో కూడా నటిస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది. అంతేకాదు మొదట సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత యాంకర్ గా కూడా రాణించింది. ఎన్నో షోలకు యాంకర్ గా పనిచేసిన శ్యామల ఎక్కువగా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మూవీ ఇంటర్వ్యూలకు హోస్ట్ గా వ్యవహరించి పేరు సొంతం చేసుకుంది. ఇక సినిమాలలో హీరోలకు వదిన క్యారెక్టర్ లో అక్కగా, చెల్లిగా కూడా నటించి మెప్పించింది.

క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన శ్యామల..

ఇక ఇండస్ట్రీలో జరిగే క్యాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. గతంలో తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. గతంలో విరూపాక్షా సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈమె.. తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇండస్ట్రీలో సినిమాల్లో నటించాలని నేను మా అమ్మ ఇద్దరం వచ్చాము. అయితే ముందుగా సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. అప్పుడు షూటింగ్లో నన్ను కొంతమంది విసిగించేవారు. నాతో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. అలాగే లవ్ ప్రపోజ్ కూడా పెట్టి ఇబ్బంది పెట్టారు. అవన్నీ తట్టుకోలేక సీరియల్స్ మానేసి వెళ్లిపోదాం అనుకున్నాను. అర్ధరాత్రి ఫోన్ చేసి హింసించేవారు అంటూ తన బాధను చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు రాజకీయాలలో క్రియాశీలకంగా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు