Anil Ravipudi: బాలయ్య బాడీ లాంగ్వేజ్ నుండి డైలాగ్స్ వచ్చేస్తాయి

Anil Ravipudi: పటాస్(Patas) సినిమాలో తెలుగులో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అనిల్ కి వచ్చాయి. అనిల్ కెరియర్లో ఇప్పటివరకు ఒకటి కూడా డిజాస్టర్ సినిమా అంటూ లేదు. రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో కూడా అద్భుతమైన హిట్ అందుకున్నాడు అనిల్. అయితే ఇప్పటివరకు అనిల్ తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసాడు. ఈ బ్యానర్ లో దిల్ రాజ్ సినిమాలను నిర్మిస్తూ ఉంటారు.

సాయి దుర్గ్ తేజ్(Sai Durg Tej) హీరోగా నటించిన సినిమా సుప్రీమ్(Supreem). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత వరుస అవకాశాలను అనిల్ రావిపూడి కి ఇచ్చాడు దిల్ రాజు. రాజా ది గ్రేట్(Raja The Great), సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2(F2), ఎఫ్ 3(F3) వంటి సినిమాలు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసాడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక ప్లాప్ సినిమా ఎలా అయితే లేదు అలానే అనిల్ కెరియర్ లో కూడా ప్లాప్ సినిమా లేదు.

Bhagavanth Kesari

- Advertisement -

నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ సినిమాలను వరుసగా చేస్తున్నాడు. అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి, అనిల్ దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక రీసెంట్గా నందమూరి బాలకృష్ణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి అతిథిగా హాజరైన అనిల్ రావిపూడి మాట్లాడుతూ బాలయ్య బాబు గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుండి పుట్టేస్తాయి. బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తాయి. నటుడు, రాజకీయ నాయకుడు, మానవత్వం ఉన్న మనిషిలా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు