Sudheer Babu: సుధీర్ బాబు రాంబో లాగా ఉన్నాడు.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా మూవీ హరోం హర. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయింది. ఇక ఈ మూవీను జ్ఞాన సాగర్ రూపొందిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుంది.

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ను ఆన్లైన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా ఆఫ్లైన్లో దర్శకుడు అనిల్ రావిపూడి, సంపత్ నందిలు రిలీజ్ చేశారు. ఇక ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోలలో సుధీర్ బాబు తనకంటూ మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.. కథలను ఎంచుకోవడంలో సుధీర్ బాబు కి మంచి టేస్ట్ ఉంది. మంచి ఫిజిక్ బాడీ తో సుధీర్ బాబు రాంబో ‌ లాగా ఉంటాడు. ఈ సినిమాలో ఆయన లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉంది.. అంటూ కామెంట్స్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రెసెంట్ ఈ డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు