Anil Ravipudi: అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ ఏంటో, నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తారట

Anil Ravipudi: పటాస్ సినిమాలో తెలుగులో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అనిల్ కి వచ్చాయి. అనిల్ కెరియర్లో ఇప్పటివరకు ఒకటి కూడా డిజాస్టర్ సినిమా అంటూ లేదు.రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో కూడా అద్భుతమైన హిట్ అందుకున్నాడు అనిల్. అయితే ఇప్పటివరకు అనిల్ తన కెరీర్లు ఎక్కువ సినిమాలు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసాడు. ఈ బ్యానర్ లో దిల్ రాజ్ సినిమాలను నిర్మిస్తూ ఉంటారు.

సాయి దుర్గ్ తేజ్ హీరోగా నటించిన సినిమా సుప్రీమ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత వరుస అవకాశాలను అనిల్ రావిపూడి కి ఇచ్చాడు దిల్ రాజు. రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్ 3 వంటి సినిమాలు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసాడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక ప్లాప్ సినిమా ఎలా అయితే లేదు అలానే అనిల్ కెరియర్ లో కూడా ప్లాప్ సినిమా లేదు.

నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ సినిమాలను వరుసగా చేస్తున్నాడు. అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి, అనిల్ దర్శకత్వంలో వచ్చిన భగవంతు కేసరి సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే అనిల్ ఈ సినిమా తర్వాత వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Venkatesh-Anil Ravipudi

అనిల్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను చేశాడు. ఈ సినిమాని కూడా ఫర్ఫెక్ట్ ప్లానింగ్ తో మొదలుపెట్టి సంక్రాంతికి రిలీజ్ చేశారు. ఇప్పుడు వెంకటేష్ తో చేయబోయే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలుకానుంది. స్టార్ హీరో సినిమా అంటే సినిమా రిలీజ్ అటో, ఇటో అవుతుంది. కానీ ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అని స్టేట్మెంట్ తో అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ ఏంటో అర్థం అవుతుంది. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు