Animal: అడ్వాన్స్ బుకింగ్ లో సంచలనం సృష్టిస్తున్న యానిమల్.. ఆ రికార్డు బ్రేక్..!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ యానిమల్.. ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో మునుపెన్నడు లేని విధంగా వైల్డ్ లుక్ లో కనిపించనున్నారు రణబీర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ లో కూడా ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. అంతేకాదు ముందస్తు బుకింగ్ వసూళ్ళ లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాని కూడా ఈ సినిమా దాటేసింది అని చెప్పాలి. అంతేకాదు టైగర్ 3, ఆది పురుష్ సినిమాలను కూడా ఢీ కొట్టడానికి సిద్ధం అయ్యింది.

ముందస్తు బుకింగ్ అప్డేట్ విషయానికి వస్తే.. యానిమల్ సినిమా ఇప్పటివరకు రూ.20.15 కోట్ల గ్రాస్ వసూలు సాధించగా.. నిన్న ఈ మొత్తం రూ.14.2 కోట్ల గ్రాస్ మాత్రమే ఉండేది. అయితే ఒక్క రోజుకే 42 శాతం వసూళ్లు పెరగడం విశేషం . మరోపక్క అడ్వాన్స్ బుకింగ్ ఈ రేంజ్ లో ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ వసూలు ఎలా ఉంటాయో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే యానిమల్ అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లు రజినీకాంత్ జైలర్ ప్రీ సేల్స్ కలెక్షన్లను మించిపోయింది. జైలర్ సినిమా రూ.18.50 కోట్ల గ్రాస్ సంపాదించగా.. ఇప్పుడు ఇదే హవా కొనసాగితే సల్మాన్ ఖాన్ టైగర్ 3 సాధించిన రూ.23 కోట్ల గ్రాస్ ని కూడా ఈ సినిమా బీట్ చేయడం పక్కా.. అంతేకాదు ఆది పురుష్ కొల్లగొట్టిన రూ.26.50 కోట్ల గ్రాస్ ని కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరొకవైపు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ.32.43 కోట్ల సాధించింది. ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో బాబి డియోల్ ,అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. 3గంటల 20 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు