Tripti Dimri: కారులో బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన యానిమల్ బ్యూటీ..!

Tripti Dimri: బాలీవుడ్ త్రిప్తి డిమ్రి( Tripti Dimri ).. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్న యానిమల్ ( Animal )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ ఊహించిన దానికన్నా ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియాలో పాప ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆమె షేర్ చేసే ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో దొరికింది..

ఈ అమ్మడు సినిమాలు తక్కువ చేసిన చేసిన కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజులో ఉందన్న విషయం తెలిసిందే.. ఈమె బోల్డ్ నెస్ కి ఎంతోమంది ఫిదా అయ్యారు.ఎందుకంటే అలా నటించడం మామూలు విషయం కాదు.దాంతో ఈ సినిమా విడుదలయ్యాక ఓవర్ నైట్ లో త్రిప్తి డిమ్రీ నేషనల్ ట్యాగ్ సంపాదించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లవర్ తో రొమాంటిక్ డేట్ కి వెళ్తూ మీడియాకి అడ్డంగా దొరికి పోయింది. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్రిప్తి డిమ్రీ లవర్ అంటూ గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి పేరు మీడియాలో వైరల్ అవుతుంది.ఆయన ఎవరో కాదు ప్రముఖ బిజినెస్ మాన్ మోడల్ అయినటువంటి సామ్ మర్చంట్.. ఈయనతో కలిసి ఈమె ఓ హోటల్ లో డిన్నర్ కు వెళ్లింది. ఆ క్రమంలో మీడియా కంట పడింది. దీన్ని చూసిన వారంతా కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

Animal beauty caught in the car with her boyfriend..!
Animal beauty caught in the car with her boyfriend..!

ఇక డైరెక్టర్ సందీప్‌ రెడ్డి ( Sandeep Reddy Vanga ) వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి నటించింది. జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది.. ఆ సినిమాలో త్రిప్తి కనిపించింది కొద్ది సేపే అయిన ఆ పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. రణ్‌బీర్‌ – త్రిప్తి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిన మేకర్స్ తమ సినిమాల్లో తీసుకోవాలని క్యూ కడుతున్నారు.. ఇక ఇటీవల భారీగా రెమ్యూనరేషన్ ను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ‘భూల్ భులయా’లో చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్ లో బ్యాడ్ న్యూజ్ అనే సినిమాలో నటించింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు