Animal Censor Cuts : ఆ సన్నివేశాలు కట్… నిరాశ తప్పదురా అబ్బాయిలు

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “యానిమల్” డిసెంబర్ 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ రిలీజ్ కోసం సినీ ప్రియులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది ఈ మూవీ. గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. అలాగే మోస్ట్ వైలెంట్ మూవీ అని సందీప్ రెడ్డివంగా చెప్తూ వస్తుండడం కూడా సినిమాపై సాలిడ్ బజ్ ను పెంచేసింది. అయితే తాజాగా మూవీ సెన్సార్ సర్టిఫికెట్ ఒకటి వైరల్ అవుతోంది.

కట్స్ తో పాటు ఏఏ సన్నివేశాలను డిలీట్ చేశారు అనే వివరాలతో ఉన్న ఆ సెన్సార్ సర్టిఫికెట్ చూసి అబ్బాయిలు డిసప్పాయింట్ అవుతున్నారు. “యానిమల్” సినిమాకు సంబంధించిన సెన్సార్ ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు ఐదు కట్స్ చెప్పారని, అలాగే ఒక ఇంటిమేట్ సన్నివేశాన్ని పూర్తిగా డిలీట్ చేయమన్నారని తెలుస్తోంది. ట్రైలర్ చూసి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని, బిగ్ స్క్రీన్ పై వాటిని చూడొచ్చని ఎక్సయిటింగ్ గా, ఫుల్ ఖుషి గా ఫీల్ అవుతున్న కొంతమంది యూత్ ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.

ఈ సినిమాలో ఐదు కట్స్ చెప్పారట, అలాగే కొన్ని పదాలను పూర్తిగా మార్చేయమని సూచించినట్టు తెలుస్తోంది. బ్లాక్, కాస్ట్యూమ్ వంటి పదాలను మార్చాలని, కొన్ని బూతు పదాలు ఎక్కడ వచ్చినా మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ లో ఉంది. ప్రస్తుతం ఆ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ ఏకంగా మూడు గంటల 20 నిమిషాలు ఉంటుందని సందీప్ రెడ్డి వంగ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమాలో చాలా దారుణమైన హింస ఉంది అంటూ ఇప్పటికే మూవీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 18 ఏళ్లలోపు పిల్లలు ఈ సినిమా చూడడానికి అనుమతించరు. పైగా ఇప్పుడు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలను మార్చాలని సూచించారట సెన్సార్ బోర్డు సభ్యులు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు