Animal Effect : హమ్మయ్య… నాని సేఫ్ !

నేచురల్ స్టార్ నాని “హాయ్ నాన్న” చిత్రంతో డిసెంబర్ 7న థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే “హాయ్ నాన్న” మూవీపై డిసెంబర్ 1న రిలీజ్ కానున్న “యానిమల్” మూవీ ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నారు సినీ విశ్లేషకులు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా మూవీ “యానిమల్”కి బజ్ కూడా భారీ లెవెల్ లో ఉంది మరి.

ఈ మోస్ట్ వైలెంట్ మూవీనీ థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాపై ఉన్న అంచనాలు, హైప్ నాని సినిమాకు గండంగా మారుతాయేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా పరిస్థితి చూస్తుంటే నాని సేఫ్ అని అనిపిస్తోంది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ‘యానిమల్’ మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ఇప్పటికే సినిమాను చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఫస్టాఫ్ అదిరిపోయిందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేసిందని అంటున్నారు. ఒకవేళ మూవీకి గనక ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన పూర్తి రివ్యూ మరికాసేపట్లో రానుంది. అప్పుడు సినిమా ఎలా ఉందన్న విషయంపై క్లారిటీ వస్తుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెన్స్ ఎంతవరకు వర్కౌట్ అయింది? సినిమా బాగుందా లేదా అనే విషయాలు తెలుస్తాయి.

అయితే ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం “హాయ్ నాన్న” మూవీ సేఫ్. “యానిమల్” మూవీ యావరేజ్ అయితే గనక ఆ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద వారం కన్నా ఎక్కువగా ఉండే అవకాశం లేదు. కాబట్టి వారం తర్వాత రిలీజ్ కానున్న “హాయ్ నాన్న” మూవీపై ఈ మూవీ ఎఫెక్ట్ కూడా పడే అవకాశం లేదు. దీంతో హమ్మయ్య మా హీరో సేఫ్ అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు నాని ఫ్యాన్స్. మరి భారీ హైప్ తో వచ్చిన “యానిమల్” మూవీ అంచనాలను అందుకుందా ;లేదా ? అనేది తెలియాలంటే ఫిల్మీఫై రివ్యూస్ సెక్షన్ లో చూడండి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు