Devara Movie : విలన్ సైఫ్ అలీ ఖాన్ ఒక్కడే కాదు… మరో బాలీవుడ్ స్టార్‌ని దింపిన కొరటాల

 

Devara Movie : జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు.

కానీ ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తోనే ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ భారీ లెవెల్ లో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. దానికి తగినట్టుగానే ఎన్టీఆర్ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో విలన్ ఎవరు అని అంటే ప్రేక్షకులు అందరూ చెప్పే సమాధానం పటౌడి ఫ్యామిలీ వారసుడు, నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అని అంటారు.

- Advertisement -

దేవర' కోసం 'యానిమల్'అన్నని దించుతున్న కొరటాల శివ... పార్ట్ 2లో రక్తపాతమే.. | Times Now Telugu

కానీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కు తోడుగా మరొకరు విలన్ పాత్రను పోషిస్తున్నారట. ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీయగా…. బాబీ డియోల్ అని తెలుస్తోంది. ఇక ఇందులో మరో విలన్ కోసం బాబీ డియోల్ ను అప్రోచ్ అవ్వగా…. బాబి డియోల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి బాబి డియోల్ విలన్ పాత్ర పోషిస్తే…. సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ విలన్. ఆ తర్వాత రోల్ బాబి డియోల్ ది అని తెలుస్తోంది. ఇక త్వరలోనే బాబి డియోల్ దేవర సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు