Anirudh: అనిరుధ్ “ఆ” ట్రెండింగ్ ఇప్పుడు

Anirudh: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిబుల్ ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాను నాగ వంశీ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుద్ గురించి అందరికీ తెలిసిందే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను తీసుకెళ్లి ఎక్కడో పెడుతుంటాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వడానికంటే ముందు నిర్మాత నాగ వంశీ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ విన్నాను సాంగ్ కంటే కూడా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాట చాలామంది ఫ్యాన్స్ కి జోష్ నింపింది. అయితే పాట నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నచ్చని వాళ్ళు మాత్రం నాగ వంశీ ను అప్పట్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Devara Second Single

- Advertisement -

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే మొదటి ఈ పాటకు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. ఈ సాంగ్ నుంచి కాపీ చేసాడు అంటూ ఒరిజినల్ సాంగ్స్ ని కూడా సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేశారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ పాట మాత్రం స్లోగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ పాటకు దాదాపు 100 మిలియన్లు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట బయట చాలా కన్సర్ట్స్ లో వినిపిస్తుంది. అయితే ఫిమేల్ వాయిస్ లో ఉండే ఈ పాటలో “ఆ” అనే ఒక హమ్మింగ్ వస్తుంది. అనిరుద్ ఇచ్చిన ఆ హమ్మింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పాట కన్సర్ట్ వీడియోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు