Anirudh: ప్రూవ్ చేసుకోవాలి

వరుస సినిమాలు సైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు సినిమాలు ఇటు రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఫుల్ స్వింగ్ లో కొనసాగిపోతున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు చిత్రం లో నటిస్తున్నాడు. దీని తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరి సినిమా రీమేక్ చేయనున్నాడు పవన్. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది.

ఇకపోతే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మన తెలుగు రాష్ట్రలో ఇంకెవరికి లేదు. వచ్చింది తమిళం నుంచే అనిరుధ్ తన మ్యూజిక్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ , అనిరుధ్ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ వసూళ్ల పరంగా నష్టం తీసుకొచ్చినా మ్యూజికల్ గా ఈ సినిమా పాటలు మంచి హిట్ అందుకున్నాయి.

సుజిత్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కి అవకాశం వస్తే, అనిరుధ్ ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అనిరుధ్ కి డేట్స్ అనుకూలంగా లేకపోవడం వలన అనిరుద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ సినిమాలను అనౌన్స్ చెయ్యడం తప్ప అంత త్వరగా సినిమాలు పట్టాలెక్కడం లేదు ఇది కూడా ఒక కారణమని తెలుస్తుంది. ఏదిఏమైనా ఈ కథనాలలో వాస్తవం ఎంతుంది అనేది పక్కన పెడితే. మరోసారి పవన్ కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి అనిరుధ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు