Anjali: క్యారవాన్ లోకి వెళ్లి ఏడ్చా..

టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోయిన్ గానే కాక స్పెషల్ క్యారెక్టర్స్, గెస్ట్ అప్పిరెన్స్, ఐటెం సాంగ్స్ కి కూడా షిఫ్ట్ అయింది అంజలి. ఇటీవల కొన్ని వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్స్ లో కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

అయితే కొన్ని వివాదాస్పదమైన సంఘటనలలో చిక్కుకోవడం వల్ల ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. షాపింగ్ మాల్ సినిమా ద్వారా మొదటిసారిగా అంజలి టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత జర్నీ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం ద్వారా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది అంజలి.

ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత బలుపు, గీతాంజలి, వకీల్ సాబ్, వంటి సినిమాలలో నటించి మెప్పించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి సినిమాలో ముద్దు, రొమాంటిక్ సీన్లలో నటించడం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ” కొన్నిసార్లు సినిమాలో పాత్రకు తగ్గట్లు ముద్దు సీన్లలో నటించాల్సి వస్తుంది. అలా మనకు ఇష్టం లేని వ్యక్తికి ముద్దు పెట్టుకోవడం చాలా ఇబ్బంది. అలా కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించినప్పుడు క్యారవాన్ లోకి వెళ్లి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. అయినప్పటికీ సీన్ పండడం కోసం నటించాల్సి వస్తుంది” అని చెప్తూ ఎమోషనల్ అయింది అంజలి.

- Advertisement -

ఇక ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు