Ankith Koyya With Allu Arjun: అల్లు అర్జున్ మాటలకు స్టేజ్ పై ఎమోషనల్ అయిపోయినా అంకిత్ కొయ్య

Ankith Koyya With Allu Arjun: ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించాడు అంకిత్ కొయ్య. రీసెంట్ గా దీపికా సునైనా తో చేసిన కవర్ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఆయ్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించి అద్భుతమైన కామెడీ జనరేట్ చేశాడు. ఈ సినిమాలో అంకిత్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అంకిత్ మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలో కనిపిస్తున్నాడు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలు రావు రమేష్ కి కొడుకు పాత్రలో అంకిత్ నటించాడు.

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు.ఆగస్టు 23న మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా విడుదల కానుంది.

Ankith Koyya

- Advertisement -

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ అంకిత్ కొయ్య గురించి ఈ అబ్బాయి నాతో ఒకప్పుడు యాడ్ చేశాడు.  అప్పుడే చెప్పాను నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని రీసెంట్గా ఆయ్ సినిమాతో హిట్ అందుకున్నాడు.  ఈ శుక్రవారం మరో సినిమాతో హిట్ అందుకోబోతున్నాడు. ఇలా కష్టపడి వచ్చిన వాళ్లంటే నాకు ఇష్టం అంటూ అల్లు అర్జున్ మాట్లాడాడు. దీంతో అంకిత్ ఎమోషనల్ అయిపోయాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు