Pawan Kalyan: అకిరా నందన్ తో అన్నా లెజనోవా.. వీడియో..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న పవన్ కళ్యాణ్.. పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర వేశారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా తనకి కేటాయించిన 21 సీట్లను గెలిపించి చూపించారు. ఇక పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ గెలవడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడంతో తన కుటుంబ సభ్యులు కూడా ఆయనకి కంగ్రాట్స్ తెలియజేశారు.

ఘన స్వాగతం పలికింది ఆయన భార్య అన్నా లెజినోవా. ఇక తన తండ్రి గెలుపు ఆనందాన్ని ఎంజాయ్ చేసేందుకు తన రెండో భార్య కుమారుడు అకీరా నందన్ కూడా అక్కడికి హాజరయ్యారు. తన సవతి తల్లి అయినా అన్నా లెజినోవా తో అకిరా నందన్ కనిపించడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు