Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయినా… భార్యకు భర్తే… అన్నా కోసం పవన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే.

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింగపూర్ లో సందడి చేశారు.. ఆయన ఎన్నికల తర్వాత మొదటి సారి విదేశాలకు వెళ్లాడు.. అది కూడా తన భార్య కోసం వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సింగపూర్ నేషనల్ యూనివర్సీటీలో జరిగిన గ్రాడ్యూయేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైయారు.. పవన్ భార్య అన్నా లెజ్నోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.. ఈ మేరకు జరుగుతున్న గ్రాడ్యూయేషన్ కార్యక్రమం కోసం డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అన్నా లెజనోవా గ్రాడ్యూయేషన్ పట్టా అందుకుంటున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన అభిమానులు మరింతగా వైరల్ చేస్తున్నారు.. డీప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకున్నారు.. మాల వేసుకున్న విషయం తెలిసిందే.. అప్పటి నుంచి దీక్షలో భాగంగా ధరించిన దుస్తుల్లోనే కనిపించిన అయన ఇప్పుడు మొదటి సారి ఫార్మల్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు..

anna leznova pawan kalyan latest photos viral in social media
anna leznova pawan kalyan latest photos viral in social media

అంత పెద్ద స్టార్ హీరో, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఇలా ఫార్మల్ లుక్ లో సింపుల్ గా కనిపించడం పై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి.. పవన్ భార్య లేజీనోవా మార్స్టార్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చెయ్యడం గమనార్హం.. వీరిద్దరి ఒక బాబు కూడా ఉన్నారు.. రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల పై ఫోకస్ పెట్టడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. అయితే పవన్ కమిట్ అయిన సినిమాలు మూడు లైన్లో ఉన్నాయి.. వాటిని చేస్తారో లేదో అన్నది క్లారిటీ లేదు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు