Annapurna studios: చిక్కుల్లో పడ్డ అన్నపూర్ణ స్టూడియోస్.. జాగ్రత్త పడాల్సిందే..?

Annapurna studios.. ఈ మధ్యకాలంలో ఫేక్ మెయిల్స్, ఫేక్ వ్యక్తులు, హ్యాకర్స్ ఇలా ఎన్నో.. కాలం తగ్గట్టుగా జనరేట్ అవుతూ ఉన్నాయి. వీటివల్ల ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నిర్మాణ స్టూడియోగా గుర్తింపు తెచ్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ కి కూడా ఇప్పుడు తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. సినిమా అవకాశాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్ అటు సంస్థ పేరును నాశనం చేయడమే కాదు చాలామంది యువత భవిష్యత్తుతో కొంతమంది ఫేకర్స్ ఆడుకుంటున్నారని చెప్పాలి.

Annapurna studios: Annapurna studios in trouble.. need to be careful..?
Annapurna studios: Annapurna studios in trouble.. need to be careful..?

అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్..

ఇకపోతే ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమందికి ఇలాంటి వాళ్లు యమపాషాలుగా మారుతున్నారు. సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తామని, డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాత కనిపించకుండా పోతారు. ఇలాంటి వారి చేతిలో చాలామంది అవకాశాల పేరుతో మోసపోయారు కూడా.. ఇప్పుడు మరి కొంతమంది ప్రముఖ సినిమా బ్యానర్స్ పేరుతో మెయిల్స్ పంపించి అవకాశాలు ఇప్పిస్తామంటూ ఆశ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఫేక్ మెయిల్స్ పంపించారు. దీనిపై తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

ఫేక్ మెయిల్స్ సారాంశం..

అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఒక సినిమా కోసం హీరో, హీరోయిన్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టు కావాలి అంటూ ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు సైబర్ నేరగాళ్లు. ముఖ్యంగా హీరోకి 20 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి అని హీరోయిన్ పాత్రకు ముగ్గురు అమ్మాయిలు కావాలని, వారి వయసు 8 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలంటూ అమాయకులకు వల వేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

ప్రకటనతో క్లారిటీ ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్..

దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి. మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఎలాంటి ప్రకటననైనా సరే మేము మా అధికారిక సోషల్ అకౌంట్స్ ద్వారానే పంచుకుంటాము. లేదా మా వెబ్సైట్ ద్వారానే స్పష్టం చేస్తాము. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో కొంతమంది ఇలా ఫేక్ మెయిల్స్ పంపించారు. ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపించే వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని 24 ఫ్రేమ్స్ తెలిపింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కొంతమంది అమాయకులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలర్ట్ అవ్వండి. ఇలాంటివి మేము పంపించలేదు అంటూ అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఖాతా X ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి రావాలనుకునే నటీనటులు దయచేసి ఇలాంటి వాటి ప్రలోభాలకు గురి కావొద్దు అంటూ అన్నపూర్ణ స్టూడియో స్పందించింది. మరి ఇకనైనా కొత్త నటీనటులు కాస్త జాగ్రత్త పడతారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు