Samantha: చైతూ విషయంలో సమంత మరో పెద్ద తప్పు..?

 

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ తాను నటించిన మొదటి సినిమా సమయం నుంచే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా నిలిచింది. ఇక సమంత తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే ….ఆ సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇక వారు కొన్నేళ్ల పాటు వారి ప్రేమను సీక్రెట్ గా కొనసాగించారు.

ఆ తర్వాత ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట అతితక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఆ విడాకులకు గల కారణాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. విడాకుల అనంతరం సమంత, నాగ చైతన్య వారి పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరు విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు అటు నాగ చైతన్య, ఇటు సమంత ఇప్పటివరకు మరో వివాహం చేసుకోలేదు.

- Advertisement -

samantha-new elle photoshoot in black dress goes viral

అయితే వీరు మళ్ళీ కలుస్తారని చాలామంది అంటున్నారు. అంతేకాకుండా ఈ జంట మళ్ళీ కలుసుకోవాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అందరిలానే సమంతా కూడా తన భర్త నాగచైతన్యతో మళ్ళీ కలవాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చైతన్య నుంచి విడాకులు తీసుకొని పెద్ద తప్పు చేశానని సమంత బాధపడుతుందట.

అంతేకాకుండా చైతన్యనే మళ్లీ భర్తగా కావాలని అనుకుంటుందట. అంతేకాకుండా తన భర్తకు విడాకులు ఇచ్చి పెద్ద తప్పు చేశానని…. అంత మంచి కుటుంబాన్ని వదులుకొని పెద్ద తప్పు చేశానని …..అసలు విడాకులు తీసుకోకుండా ఉండుంటే నా లైఫ్ బాగుండేదంటూ బాధపడుతుందట. ఇక ఈ విషయం తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. వారు మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు