Kalki 2898AD : రిలీజ్ కు ముందే కల్కికి మరో బూస్ట్.. అక్కడ రికార్డ్ బ్రేక్..

Kalki 2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కోసం ఫ్యాన్స్, సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. భారీ యాక్షన్ సీన్స్ ట్రైలర్ లో చూపించారు.. ప్రభాస్ యాక్షన్ సీన్లలో అదరగోట్టాడు.. ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఉత్తర అమెరికాలో కొన్ని రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.. ప్రీసేల్స్ ద్వారా 2 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరో రికార్డ్ ను బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది..

కల్కి సినిమా తాజాగా ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఏకంగా 210 కి పైగా ఐమాక్స్ షోలలో కల్కి ప్రదర్శితం కానుంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకీ ఈ స్థాయిలో ఐమాక్స్ షోలు నిర్వహించలేదు. దీన్ని బట్టి చూస్తే అక్కడ డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది.. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, మృణాల్ ఠాకూర్, పశుపతి, అన్నా బెన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చారు..

Another boost for Kalki before the release.. there is a record break..
Another boost for Kalki before the release.. there is a record break..

రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించారు.. ఆ ఈవెంట్ బాగా హైలెట్ అయ్యింది.. కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈవెంట్ లను నిర్వహించనున్నారని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.. ముందుగా అమరావతిలో ఇది నిర్వహించాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేద్దామని నిర్ణయం మార్చుకున్నట్లుగా కూడా టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఇక ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించకూడదని మూవీ టీమ్ భావిస్తుందట.. ఈ వార్త తెలుగు అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. మరి నాగి ప్రేక్షకుల అంచనాలను రిచ్ అవుతాడో లేదో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే…

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు