Kannada Actor : కన్నడ ఇండస్ట్రీలో మరో దర్శన్.. ప్రియురాలికోసం భార్య పై దాడి..

Kannada Actor : కన్నడ ఇండస్ట్రీలో ప్రేమ, ఏఫైర్స్ దాడులు కామన్ అయ్యాయి.. ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రేమలు రోజు రోజుకు హాట్ టాపిక్ అవుతున్నాయి.. మొన్నటివరకు దర్శన్, పవిత్ర గౌడ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.. ఇప్పుడు మరో నటుడి ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. అసలు అతను ఎవరు? ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సన్నిమహిపాల్‌.. ఈయన ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.. ఆయన అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నట్లు నమ్మించి శారీరకంగా ఒకటి కావడంతో ఆమె గర్భం దాల్చింది. గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిమాండ్‌ చెయ్యడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత పెళ్లి అయ్యాక తన తల్లి దండ్రులకు చెప్పి ఒప్పిస్తానని మాట ఇచ్చాడు.. అప్పటివరకు ఫ్రెండ్స్ లాగే ఉందామని అనడంతో ఆమె సరే అని ఒప్పుకుంది..

Another Darshan in Kannada industry.. Attack on wife for girlfriend..
Another Darshan in Kannada industry.. Attack on wife for girlfriend..

ఆ తర్వాత మంగళూరు వెళ్లి కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విషయం ఆ యువతి అతను ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లింది. ఆ మాటలు కాస్త గొడవగా మారాయి.. దాంతో కోపంతో రగిలిపోయిన అతను ఆమె పై దాడికి తిరగబడ్డాడు.. గొడవ జరగడంతో సన్నిమహిపాల్‌ ఆమెపై చాకుతో దాడి చేశాడు. అనంతరం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ గొడవలో తనకు అబార్షన్‌ అయిందని భార్య తెలిపింది.. తను బలవంతంగా వివాహం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ సన్నిమహిపాల్‌ సదరు యువతిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు.. ఈ గొడవ ఇప్పుడు కోర్టు మెట్లేక్కినట్లు తెలుస్తుంది.. ఇక ఇలాంటి గొడవలు కన్నడలో కామన్ అయ్యాయి.. ఈ వివాదం ఇంకెన్ని గొడవలకు కారణం అవుతుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు