Pushpa 2: పుష్ప 2 విషయంలో సుకుమార్ కి మరో తలనొప్పి.. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన నటుడు..!

Pushpa 2: ఎప్పటికప్పుడు పుష్ప 2 విషయంలో ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే వస్తుంది. మొన్నటికి మొన్న బన్నీ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం సుకుమార్ పుష్ప 2 విషయంలో ఎంత తలనొప్పిగా మారిందో మనందరం చూసాం. పొలిటికల్ పరంగా వేలు పెట్టి బన్నీ కొత్త సమస్య తీసుకొచ్చాడు.

అయితే తాజాగా మరోసారి అదే విధంగా పుష్ప 2 కి భారీ సమస్య వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా విషయంలో సుకుమార్ కొత్త తలనొప్పులను ఫేస్ చేస్తున్నాడట. ఈ సినిమాకి విలన్ గా నటిస్తున్న ఫహిద్ ఫాజిల్ లాస్ట్ మినిట్ లో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. నిజానికి అనుకున్న దానికన్నా ఎక్కువగా కాల్ షీట్స్ కావాల్సి వచ్చిందట.

Another headache for Sukumar in the case of Pushpa 2
Another headache for Sukumar in the case of Pushpa 2

అయితే ఒక మలయాళం సినిమాకి అదే తేదీన కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడం ఇప్పుడు పుష్ప 2 కి అడ్జస్ట్ చేయలేకపోవడంతో.. సినిమా షూట్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ మిగతా నటీనటులు ఆ టై కాల్ షీట్స్ లో పాల్గొనాల్సి ఉండడంతో ఫహిద్ ఫాజిల్ కారణంగా ఏకంగా 15 రోజులు ఈ సినిమా షూట్ ఆలస్యం కాబోతుందట. ఈ విధంగా సుకుమార్ కి మరో కొత్త తలనొప్పి ఎదురైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు