ANR: మనవళ్ళ భవిష్యత్తు ముందే ఊహించారా.. అందుకే..?

ANR: అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన ముందుచూపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే.. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ ప్రొడక్షన్ హౌస్ పేరిట పెట్టుబడిగా పెట్టి భవిష్యత్తుకు పునాదులు వేశారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించిన అక్కినేని నాగేశ్వరరావు, ఈ స్టూడియో ద్వారా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియోస్ అంటే గొప్ప పేరున్న నిర్మాణ సంస్థ గా తీర్చి దిద్దారు.

ANR: Did you foresee the future of our grandchildren.. that's why..?
ANR: Did you foresee the future of our grandchildren.. that’s why..?ANR: Did you foresee the future of our grandchildren.. that’s why..?

కొడుకులతో పోటీ పడుతున్న నాగార్జున..

ఇకపోతే ఈయన వారసుల విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడిగా ఇప్పటికీ మంచి పేరు దక్కించుకొని, ఆరు పదుల వయసు దాటినా కూడా ఇంకా తన అందచందాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సొంతం చేసుకున్నారు అక్కినేని నాగార్జున. ఈయన కొడుకులకు పెళ్లిళ్లు జరిగి విడాకులైనప్పటికీ, ఇప్పటికీ కొడుకులతో పోటీపడుతూ తన సినిమాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు కొన్ని యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు నాగార్జున.

మనవళ్ల భవిష్యత్తు ముందే ఊహించారా..

అయితే అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున ల రేంజ్ లో అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య సక్సెస్ దిశగా అడుగులు వేయలేకపోతున్నారని చెప్పవచ్చు. వీరిద్దరికి కూడా సరైన సక్సెస్ లేదు. అక్కినేని నాగచైతన్యతో పోల్చుకుంటే అక్కినేని అఖిల్ మరింత దారుణమనే చెప్పాలి. ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్టు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. నాగచైతన్య మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ తన సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని, ఆ తర్వాత కస్టడీ సినిమాతో ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరొకసారి సాయి పల్లవి తో తండేల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై కూడా అంచనాలు భారీ గానే పెరిగిపోయాయి. ఇకపోతే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వీరిద్దరూ చాలా ఏళ్లవుతున్నా ఇంకా టైర్ 1 హీరోగా పేరు దక్కించుకోలేకపోతున్నారు. రాను రాను పరిస్థితులు చూస్తుంటే ఇద్దరికీ నటన జీవితం పెద్దగా కలిసి వచ్చేటట్టు కనిపించడం లేదు. అందుకే ఏదైనా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.. ఇందులో భాగంగానే మనవళ్ళ భవిష్యత్తుని ముందే ఊహించిన అక్కినేని నాగేశ్వరరావు వీరి కోసం అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించినట్లు ఒక కొత్త వార్త తెరపైకి వస్తోంది. భవిష్యత్తులో వీరు సినిమాలు నిర్మించకపోయినా.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ చిత్రాలను నిర్మించి నిర్మాతలుగా సక్సెస్ అవుతారని.. అందుకే అప్పట్లోనే భారీ హంగులతో ఈ స్టూడియోని నిర్మించారు అక్కినేని నాగేశ్వరరావు. ఇప్పుడు దీని విలువ కొన్ని వేలకోట్ల పై మాటే.. ఇక వీరి భవిష్యత్తును ముందుగానే ఆలోచించి ఏఎన్నార్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు