Anshu Saggar : సందీప్ కిషన్ సినిమాలో రావు రమేష్ తో “మజాకా” అంటున్న మన్మథుడి లవర్..

Anshu Saggar : టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు చేసినవి తక్కువ సినిమాలే అయినా, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. చేసినవి తక్కువ సినిమాలైనా కొందరు నటీనటులు ఆ సినిమాల ద్వారా ఇచ్చే ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. కొందరు భామలు కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే పెళ్లి చేసుకుని సినిమాలకి గుడ్ బై చెప్పిన వారు ఎందరో. అలాంటి హీరోయిన్లలో ‘అన్షు సగ్గర్’ ఒకరు. ఈమె నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ అని తెలిసిందే. మన్మథుడు సినిమాలో అన్షు కనిపించింది కొద్దిసేపే అయినా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే ఆ తర్వాత ప్రభాస్‌ తో కలిసి రాఘవేంద్ర సినిమాను చేసింది. అయితే కెరీర్‌ ప్రారంభించిన కొన్నాళ్లకే అన్షు ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యింది. ఇక రీసెంట్ గా మన్మథుడు సినిమా రీ రిలీజ్ అయ్యాక ఈ అమ్మాయి మళ్ళీ తెగ వైరల్ అయింది. ఇన్నాళ్లు విదేశాల్లో ఉన్న అన్షు ఎట్టకేలకు సోషల్‌ మీడియా ద్వారా బయటకు కనిపించింది. గతంలో మాదిరిగానే అందంగా ఉన్న అన్షు మళ్లీ నటించేందుకు రెడీ అంటూ ప్రకటించింది.

Anshu Saggar Special Role in Sundeep kishan 'Majaka' Movie

సందీప్ కిషన్ మజకాలో అన్షు..

ఇక నటి అన్షు సగ్గర్ పెళ్లి చేసుకుని అమెరికా లో సెటిల్ అవగా, రీసెంట్ గా సోషల్ మీడియాతో జనాల్లోకి మళ్ళీ వైరల్ అయింది. అయితే తాజాగా అన్షు మళ్ళీ టాలీవుడ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇక ఆ మధ్య ఇంటర్వ్యూ లో మంచి రోల్ వస్తే ఇప్పుడు సినిమా చేయడానికి తాను రెడీ గా ఉన్నానని ఓ ఇంటర్వ్యూ లో అన్షు చెప్పుకొచ్చింది. ఇక అనుకున్నదే తడవుగా ఈ హీరోయిన్ కోసం వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ‘మజాకా’ అనే సినిమాలో నటించేందుకు కమిట్‌ అయ్యింది. ఆ సినిమాలో హీరోగా సందీప్‌ కిషన్ నటిస్తున్నాడు. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

- Advertisement -

రావు రమేష్ తో పెయిర్ గా అన్షు..

అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రావు రమేష్ ప్రియురాలి పాత్రలో అన్షు (Anshu Saggar) కనిపించబోతుందట. రావు రమేష్ మరియు అన్షు ల మధ్య ఉండే లవ్‌ స్టోరీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే మెయిన్ హీరో హీరోయిన్స్ స్థాయిలో వీరి స్క్రీన్‌ ప్రజెన్స్ ఉంటుందని, అంతే కాకుండా వీరిద్దరి కాంబో లవ్‌ సీన్స్ కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో ఉంటాయని అంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన్మథుడి లవర్ అన్షు కి ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది చూడాలి. ఇక మజాకా సినిమా తో అన్షు హిట్‌ కొట్టగలిగితే ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్‌ టాలీవుడ్‌ లో సినిమా ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు